తిరుమల ఘాట్‌ రోడ్డులో చిరుత దాడి | Leopard Attack On Devotees In Tirumala Ghat Road | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేసేందుకు యత్నం

Published Tue, Aug 4 2020 4:51 PM | Last Updated on Tue, Aug 4 2020 8:34 PM

Leopard Attack On Devotees In Tirumala Ghat Road - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో చిరుత హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు భక్తులకు, స్థానికులకు కనిపించి భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుత.. నేడు ద్విచక్ర వాహన దారునిపై దాడికి ప్రయత్నించింది. తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఈ సంఘటన చోటు చేసుకుంది. అలిపిరి నుంచి 4 కిలో మీటర్ల దూరంలో ఇద్దరు వాహనదారులుపై చిరుత దాడి చేసింది. వారిని కాపాడటానికి ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కూడా దాడికి ప్రయత్నించింది. అయితే అదృష్టవశాత్తు వాహనదారులు అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. దీని గురించి సమాచారం అందుకున్న విజిలెన్స్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వారు వచ్చేలోపే చిరుత అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది.

మధ్యాహ్నం తిరుమల ఘాట్‌ రోడ్డులో పోలీసులు, స్థానికులపై దాడి చేసిన చిరుత.. మళ్లీ సాయంత్రం మరోసారి స్థానికులపై దాడి చేసింది. ఒకే రోజు రెండు సార్లు చిరుత దాడి చేయడానికి ప్రయత్నించడంతో స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement