సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కరువైందని, తెలంగాణలో కాంగ్రెస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అమ్మేశారని బీజేపీ కేంద్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రజల్లో కనిపించడం లేదని, కాంగ్రెస్ భూస్థాపితం అయిందని ఆమె అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలసి డీకే అరుణ ప్రచారం నిర్వహించారు. ( బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ: ఉత్తమ్ )
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ నుండి టికెట్ ఇచ్చి బీజేపీని అడ్డుకోవాలని టీఆర్‌ఎస్ పెద్దల ప్లాన్. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని భయంతోనే ఇలా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోరిలో వేసినట్లే. టీఆర్ఎస్ పార్టీని ఓడించే దమ్ము ఒక్క కమలం పువ్వు గుర్తుకే ఉంది. టీఆర్ఎస్‌కు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాల’’ని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment