సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 'దుబ్బాక నుంచి నాయకులు ,కార్యకర్తలు ఇచ్చిన సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్ అహంకారాన్ని దెబ్బకొట్టాలనే 81 శాతం ఓటింగ్ పొలైంది. దుబ్బాక లో బీజేపీ విజయం సాధించబోతుంది.ఇన్ని రోజులు అవస్తవాలను వాస్తవాలుగా చిత్రికరిస్తూ టీఆర్‌ఎస్ అబద్ధాలు చెప్తూ వచ్చింది. అసలు దుబ్బాకలో అభివృద్ధి జరగలేదు. టీఆర్‌ఎస్ పార్టీ పై ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఓటర్లు ఆలోచించరు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా బీజేపీకి కలిసి వస్తుంది.
ఒక కార్యకర్త తెలిసీ తెలియక ఆత్మహత్య చేసుకుంటే మంత్రులు ఏమాత్రం బుద్ధి లేకుండా 'వాడు' అనే మాటలు మాట్లాడుతున్నారు.హోటల్ లో జరిగింది తోపులాట మాత్రమే ఒక శాసన సభ్యుడు ఇలా పిర్యాదు చేయడం మంచిది కాదు. నిన్న జరిగిన ఘటనను టీఆర్‌ఎస్ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎన్నో కుట్రలు,కుతంత్రాలు పాల్పడడంతో పాటు డబ్బులు కూడా విచ్చలవిడిగా పంచారు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో సానుభూతి, సెంటిమెంట్ అబద్ధాలతోనే గెలిచింది. (చదవండి : ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్)
దుబ్బాకకు రావాల్సిన నిధులు దారి మళ్లించారు. దుబ్బాక ప్రజలంతా రఘునందన్ రావునే ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు దుబ్బాక లో ఓటుకు 5వేల నుంచి 10 వేల వరకు టార్గెట్ పెట్టుకొని మరీ పంచినట్లు సమాచారం అందింది. దుబ్బాక ప్రజలు నిజాయితీ పరులు.. వారు ఇచ్చిన డబ్బు తీసుకున్న బీజేపీకే ఓట్లు వేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ప్రత్యేక డాక్టర్ల బృందం శ్రీనివాస్ బతికించడం కోసం కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా తెలంగాణ పథకాల్లో సీఎం కేసీఆర్ ఎన్ని అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. గతంలో హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తా అన్నారు. జీహెచ్ఎంసీ పన్నుల విషయంలో ఓల్డ్ సిటీ లో వసూలు చేయడానికి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ ఆరు సంవత్సరాల్లో రైతులకు నష్టపరిహారం ఇచ్చారా...? అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment