సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ప్రజలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సంక్రాంతి గిఫ్ట్ ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా బుధవారం కేంద్ర హోంశాఖ సహా య మంత్రి కిషన్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు బీజేపీ ఎక్కడ ఉందని కేసీఆర్ అన్నారని, ఆయన సొంత జిల్లాలోనే బీజేపీ ఉందని ఇప్పుడు చెబుతున్నానన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పాతబస్తీలో పన్నులు ఎంత వసూలు చేస్తున్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పట్లేదన్నారు. ఓట్ల కొనుగోలు కోసమే జీహెచ్‌ఎంసీలో రూ.10 వేల నగదు పంచుతున్నారని విమర్శించారు.
వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని, 2023లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల విషయంలో బీజేపీ అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పరిశీలించి పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వల్లే సాధ్యమైందని చెప్పారు. తమపై దుబ్బా క ప్రజలు గురుతర బాధ్యత పెట్టినట్లుగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
అధికార దుర్వినియోగం చేశారు..: కిషన్‌రెడ్డి
దుబ్బాకలో కేసీఆర్ ప్రభుత్వం అధికారిక దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. చట్ట వ్యతిరేకంగా బీజేపీ నేతల ఫోన్‌లను ట్యాప్ చేశారని మండిపడ్డారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిని జైల్లో పెట్టారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర అధికారులతో చర్చించి ఏమి చేయాలనే దానిపై యోచి స్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగేందుకు పని చేస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర శాఖ చొరవతో కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటించాయని, పంట నష్టంపై కేంద్ర బృందాలకు ఇప్పటివరకు రాష్ట్ర సర్కార్ నివేదిక ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే పంట నష్టంపై అధికారులతో సమీక్ష చేసి రిపోర్ట్ పంపించాలని సూచించారు. (ఒక ఎన్నిక.. అనేక సంకేతాలు!)
Comments
Please login to add a commentAdd a comment