సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటూ డీజీపీ మహేందర్‌రెడ్డిని టీఆర్‌ఎస్ నేతలు కోరారు. ఆదివారం సాయంత్రం డీజీపీని కలిసిన టీఆర్‌ఎస్ నేతలు... హైదరాబాద్‌లో విధ్వంసానికి బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, సైదిరెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు డీజీపీని కలిశారు. అనంతరం ఈసీ అదనపు సీఈఓ బుద్ధ ప్రకాష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతకు ముందునగరంలో అల్లర్లు సృష్టించి ద్వారా వచ్చే సానుభూతితో దుబ్బాక ఉపఎన్నికలో కొన్ని ఓట్లు సాధించాలని బీజేపీ అనుకుంటోందని, ఆ పార్టీ నాయకుల నుంచే తమకు విశ్వసనీయ సమాచారం ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. (రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్)
Comments
Please login to add a commentAdd a comment