
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పెద్ద మొత్తంలో పట్టుకున్న హవాలా నగదుకు సంబంధించి ఇద్దరు వక్తులను అరెస్ట్ చేసినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇన్నోవా కారుతో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘పట్టుబడ్డ నగదు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావుది గుర్తించాం. శ్రీనివాస్‌రావుతో పాటు కారు డ్రైవర్ రవి కుమార్‌ను అరెస్ట్ చేశాం. బేగంపేట ఫ్లైఓవర్ సమీపంలో ఈ నగదును పట్టుకున్నాం.
స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో చాలా కీలక సమాచారం సేకరించాం. కాల్ లిస్ట్‌లో రఘనందన్‌రావుకు నేరుగా శ్రీనివాస్ ఫోన్ చేశాడు. కోటి రూపాయిలకు పైగా హవాలా నగదును పట్టుకున్నాం. ఈ నగదును విశాక ఇండస్ట్రీ నుంచి దుబ్బాకకు వెళుతున్నట్లు గుర్తించాం. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు ఎప్పుడు కృత నిశ్చయంతో ఉంటారు’ అని సీపీ అంజనీకుమార్ తెలిపారు. (దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి)
కాగా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలో ప్రచార వేగం పెంచాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలు ఈ నెల 3న జరగనున్న దృష్ట్యా పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేర మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వెయ్యిమంది ఓటర్లను ప్రమాణికంగా తీసుకుని అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment