సాక్షి, సిద్దిపేట: దసరా సందర్భంగా సోమవారం దుబ్బాక ఆర్యవైశ్య సంఘం వారు అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్శవైశ్య భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. దుబ్బాకకు ఇప్పుడు వచ్చే వారు కేవలం ఓట్ల కోసమే వస్తున్నారు. ఉత్తమ్‌కు దుబ్బాక ఎలా ఉంటదో తెలియదు. మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సారి దుబ్బాకకు రాలేదు. హుజూర్ నగర్‌లో టీఆర్‌ఎస్ గెలిస్తే ఏమొస్తది అని ఉత్తమ్ అన్నారు. కానీ మేం గెలిచాక.... కేసీఆర్ ఆ నియోజకవర్గానికి వెళ్లి 300 కోట్ల రూపాయల పనులు మంజూరు చేశారు. రేపు దుబ్బాక కూడా అదే రీతిలో అభివృద్ధి అవుతుంది. దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే.. అనుమానం అవసరం లేదు. సుజాతక్క నా తోబుట్టువు. నేను జిల్లా మంత్రిని. కేసీఆర్ ఆశీస్తులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తా’ అని స్పష్టం చేశారు హరీశ్ రావు. (చదవండి: ‘కేసీఆర్‌ను ఓడిస్తేనే అన్ని అమలు అవుతాయి’)
‘సీఎం ఆశీస్సులతో నారాయణ ఖేడ్‌ను నేను అభివృద్ధి చేశాను. 200 వందల కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి రోడ్లు వేయించా. ఎన్నికల వరకే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉంటారు. ఆ తర్వాత కూడా నేను, సూజాతక్క ఉంటాము. ఓసీ పేదలకు సహాయం అందుతుందంటే అదీ తెలంగాణ రాష్ట్రంలోనే... దేశంలో ఈ విధానం ఎక్కడా లేదు. ఆర్య వైశ్య కార్పోరేషన్‌ను తప్పకుండా ఏర్పాటు చేస్తాం’ అన్నారు హరీశ్ రావు.
Comments
Please login to add a commentAdd a comment