సాక్షి, హైదరాబాద్ : బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ సవాల్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. కేంద్రం నిధులపై కేసీఆర్‌తో చర్చకు బండి సంజయ్ వస్తారని ప్రకటించారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు దమ్ముంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బండి సంజయ్‌తో చర్చకు ఒప్పించాలని సవాల్ చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర నిధులపై తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు స్పష్టత లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
(చదవండి : బండి సంజయ్‌తో చర్చకు ఎక్కడైనా సిద్ధమే..)
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో హారీశ్‌రావు ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల జోలికొస్తే టీఆర్‌ఎస్ అంతు చూస్తామని హెచ్చరించారు. ఓటమి భయంతో చెరుకు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించి హరీశ్‌రావే టికెట్ ఇప్పించారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దుబ్బాకలో తప్పకుండా బీజేపీ గెలుస్తుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. కాగా, నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment