ధోకాబాజీలను నమ్మొద్దు | Dubbaka ByPolls: Harish Rao Fires On BJP and Congress Party | Sakshi
Sakshi News home page

ధోకాబాజీలను నమ్మొద్దు

Published Thu, Oct 22 2020 9:01 AM | Last Updated on Thu, Oct 22 2020 9:01 AM

Dubbaka ByPolls: Harish Rao Fires On BJP and Congress Party - Sakshi

రోడ్‌షోలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత

సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతవుతాయని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దుబ్బాకలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత మాటలను నమ్మవద్దని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు ప్రజలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. కల్లబొల్లి మాటలను దుబ్బాక ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఎక్కడో పట్నంలో ఉండి పిలుపునిస్తే వచ్చి ఓట్లు వేసే రోజులు పోయాయని, ఇక్కడి ప్రజలు అమాయకులేం కాదన్నారు. ప్రజల మధ్య ఉంటూ.. వారి కష్ట, సుఖాల్లో పాలుపంచుకునే వారినే తమ నాయకుడిగా ఎన్నుకుంటున్నారని హరీశ్‌ పేర్కొన్నారు. సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఈ ప్రాంతం ప్రజలు మంచి నాయకుడిని కోల్పోయారన్నారు. చింతమడకలో పుట్టి, దుబ్బాకలో చదువుకున్న సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ప్రాంతం, ఇక్కడి ప్రజలు అంటే ఎంతో ఇష్టం అని పేర్కొన్నారు. అందుకోసమే అడగకుండానే నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. 

బుధవారం దుబ్బాకలో జరిగిన రోడ్‌ షోలో పాల్గొన్న జనం 

బీజేపీ తోక ముడిచింది 
దుబ్బాక ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాంతం మహిళల ఇబ్బందులను నేరుగా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బీడీ కారి్మకులకు పింఛన్లు అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం బీడీ కారి్మకులకు నెలకు రూ.2,016 ఇస్తుంటే.. వాటిలో రూ. 1,600 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని బీజేపీ నేతలు అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాపై బహిరంగ చర్చకు రమ్మని సవాల్‌ చేస్తే బీజేపీ నేతలు తోక ముడిచారని విమర్శించారు. ఒకవేళ బీడీ కారి్మకులకు కేంద్రం నిధులు ఇస్తే ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రంలో పింఛన్లు కేవలం రూ. 500లే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. పనులు చేయకుండానే బీజేపీ నాయకులు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  

సూట్‌కేసులతో వచ్చిన కాంగ్రెస్‌ నేతలు  
ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ నాయకులకు ఈ ప్రాంతం ప్రజల కష్టాలు కని్పంచలేదా అనిహరీశ్‌ నిలదీశారు. ఏనాడు ప్రజల కష్టాలను చూడని కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడూ సూట్‌కేసులు సర్దుకొని దుబ్బాకలో మకాం వేసి.. మీటింగ్‌లు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. దుబ్బాక నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా మహిళా అభ్యర్థి పోటీ చేయడాన్ని హర్షిస్తూ.. నియోజకవర్గంలోని మహిళలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అందుకోసమే ఈ సమావేశానికి మహిళలు దండుగా కదలి వచ్చారన్నారు. ప్రజల స్పందన, చూస్తుంటే..టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్షకు పైగా మెజారీ్టతో గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు పోటీ పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement