
మెదక్ ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపు
మెదక్: మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. శనివారం ఉదయం పోలింగ్ ఆరంభమైన కాసేపటికే సిద్దిపేటలోని భరత్ నగర్, మార్కెట్ యార్డు పోలింగ్ స్టేషనల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది.
మెదక్ మండలం తిమ్మాపూర్లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ప్రారంభంకాలేదు. రామాయంపేట మండలంలోనూ ఓ పోలింగ్ స్టేషన్లో ఈవీఎం మొరాయించింది. ములుగు మండలం జంగాపూర్లో గ్రామస్తులు పోలింగ్ను బహిష్కరించారు. గ్రామాభివృద్దిని పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.