మెదక్ లోక్సభ ఉప ఎన్నికలు శనివారం ఉదయం 7 గంటలకు ఆరంభమయ్యాయి. కొన్ని చోట్లు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆగిపోయింది. మరికొన్ని చోట్ల గ్రామస్తులు ఓటేయడానికి నిరాకరించారు. మొత్తమ్మీద ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. విశేషాలు..
- మొత్తం ఓటర్లు-15.43 లక్షల మంది
- 1,101 గ్రామాల్లో 1,817 పోలింగ్ కేంద్రాలు
- 7,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వగ్రామం చింతమడకలో ఓటు వేశారు.
- సంగారెడ్డిలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి
- శివంపేట మండలం గోమారంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి ఓటు వేశారు.
- సిద్దిపేటలో ఓటే వేసిన మంత్రి హరీష్ రావు దంపతులు
- రామాయంపేట మండలం కోనాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
- పాపన్నపేట మండలం కొత్తపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయటానికి పిట్స్ వచ్చిన ఓ మహిళ పిట్స్ రావడంతో కింద పడిపోయింది.
- ములుగు మండలం జంగాపూర్లో పోలింగ్కు నిరాకరించిన గ్రామస్తులు
- వెల్దుర్తి మండలం నెల్లూరు, పెద్దాపూర్ గ్రామాల్లో ఓటుహక్కును నిరాకరించిన గ్రామస్తులు
- సిద్దిపేట భరత్ నగర్, మార్కెట్ యార్డు పోలింగ్ స్టేషన్లో ఈవీఎంల మొరాయింపు
- రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌లోఈవీఎం మొరాయింపు
- మెదక్ మండలం తిమ్మానాగర్‌లో మొరాయించిన ఈవీఎం
- నంగనూరు మండలం బద్దిపడగలో ఈవీఎంల మొరాయింపు