
ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెదక్: మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రజలను కోరారు. శనివారం మెదక్ ఉప ఎన్నికలు ప్రారంభమైన కొద్దిసేపటికి హరీష్ రావు దంపతులు సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
గ్రామీణులు, విద్యావంతులు ప్రతి ఒక్కరు ఓటేయాలని హరీస్ రావు విన్నవించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన సొంతూరు చింతమడకలో ఓటు వేస్తారని చెప్పారు.