
న్యూఢిల్లీ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎదురు చూపులు ఫలించాయి. బీజేపీ జాతీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు నవంబర్ 23న ఢిల్లీ వెళ్లిన పవన్ ఎట్టకేలకు బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. జేపీ నడ్డా నివాసంలో బుధవారం సమావేశమైన పవన్.. తిరుపతి ఎంపీ టికెట్‌తోపాటు పలు విషయాలపై చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. చదవండి: ప్రాపకం కోసం బీజేపీ, జనసేన మధ్య అంతర్యుద్ధం
నడ్డాతో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఉప ఎన్నిక కోసమే రాలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. ఏపీలోని తాజా పరిస్థితులపై నడ్డాకు వివరించినట్లు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిపై చర్చించామని, జనసేన అభ్యర్ధా, బీజేపీ అభ్యర్ధా అన్న విషయం కమిటి నిర్ణయిస్తుందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై కమిటి వేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment