చంఢీగడ్: పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఖాళీ చేసిన సంగ్రూర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. ఆదివారం వెలువడిన ఫలితాల్లో.. శిరోమణి అకాళిదల్ అభ్యర్థి సిమ్రన్ జిత్ మాన్ .. ఆప్ అభ్యర్థి గుల్మైర్‌పై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
సంగ్రూర్ నుంచి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో భగవంత్ ఎంపీగా గెలుపొందారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. దీంతో సీఎంగా భగవంత్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఆయన గెలుపొందిన సంగ్రూర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో సంగ్రూర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా పంజాబ్‌లో గెలిచిన ఆప్ ఉపఎన్నికలో విజయం ఖాయమనుకున్నారు. కానీ అలా పంజాబ్‌లో అధికారం చేపట్టిందో లేదో.. అంతలోనే ఇలా ఓటమి పాలవడం ఆప్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి.
చదవండి: మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్.. రంగంలోకి దిగిన రష్మీ థాక్రే
Comments
Please login to add a commentAdd a comment