బంపర్ మెజార్టీతో గెలవాలి
హైదరాబాద్: మెదక్ లోక్సభ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు పార్టీ నాయకులు సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 50 వేలకు పైగా మెజార్టీ రావాలని ఆదేశించారు. కేసీఆర్ పార్టీ ప్రచార బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఈటెల్ రాజేంద్రకు అప్పగించారు.
మెదక్ లోక్సభ అభ్యర్థి గురించి టీఆర్ఎస్లో పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. దేవీ ప్రసాద్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, ప్రవీణ్‌రెడ్డి తదితరుల పేర్లు పరిశీలించారు. అభ్యర్థి ఎంపిక బాధ్యతను టీఆర్ఎస్ అధినేతకు అప్పగించారు. మెదక్ అభ్యర్థిగా ఎవరిని నింపాలన్న విషయంలో కేసీఆర్ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు.