
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం
ఉత్తరాఖాండ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.
డెహ్రాడూన్: లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి నైరాశ్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగించే విజయం దక్కింది. ఉత్తరాఖాండ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.
ఆ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ 19 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.