హిమాచల్ సీఎం సతీమణి విజయం
బెంగాల్‌లో తృణమూల్ క్లీన్‌స్వీప్
పంజాబ్ బైపోల్ ఆప్‌దే..
13 స్థానాల్లో పది ఇండియాకు.. రెండు బీజేపీకి.. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి
ఉప ఎన్నికల ఫలితాలతో.. ఎన్డీయేకు షాక్, ఇండియాకు బూస్ట్
ఢిల్లీ, న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 10 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించగా.. కేవలం రెండు స్థానాల్లోనే ఎన్డీయే కూటమి విజయాన్ని అందుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.
కాగా, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే ఇండియా కూటమి అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగారు. ఇక, బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా అన్ని స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. బెంగాల్‌లోని రాయిగంజ్ (కృష్ణ కల్యాణి), రణఘాట్ సౌత్ (ముకుత్ మణి అధికారి), బాగ్ద (మధుపర్ణ ఠాకూర్), మాణిక్తలా(సప్తి పాండే) విజయం సాధించారు. ఇక్కడ బీజేపీకి గట్టి షాక్ తగింది. మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్ర, నలగార నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. హమీర్‌పూర్ స్థానంలో బీజేపీ గెలుపొందింది.
ఇక, మధ్యప్రదేశ్‌లోని అమర్వర అసెంబ్లీలో బీజేపీ అభ్యర్ధి కమలేష్ ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం అందుకున్నారు. తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ ఘన విజయం సాధించారు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ (లాక్ పత్ సింగ్), మంగళూర్(క్వాజి మొహమ్మద్ నిజాముద్దిన్) కాంగ్రెస్ విజయభేరి మోగించింది. కాగా, బీహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ గెలుపొందడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా.. ఉప ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి బూస్ట్ ఇవ్వగా, ఎన్డీయే కూటమికి షాకిచ్చాయి.
సీఎం సతీమణి విజయం..
హిమాచల్ ప్రదేశ్‌లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి, కాంగ్రెస్ అభ్యర్థి కమలేశ్ ఠాకుర్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థిపై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్‌దీప్ సింగ్ బవా 8,990 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక, హమీర్‌పుర్ స్థానంలో భాజపా అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు.
బెంగాల్‌లో తృణమూల్ క్లీన్‌స్వీప్..
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరుమీదున్న తృణమూల్ కాంగ్రెస్.. తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ఇక్కడ రాయ్‌గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్‌తలా.. నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఉత్తరాఖండ్‌లో మంగలౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది.
పంజాబ్ బైపోల్ ఆప్‌దే..
పంజాబ్‌లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ విజయం సాధించారు.
- మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడాలో భాజపా నేత కమలేశ్ షా గెలుపొందారు.
- బిహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ జయకేతనం ఎగురవేశారు.
Assembly by-elections: Out of 13 Assembly seats, Congress won four seats. TMC won 4 seats. AAP won the Jalandhar West seat in Punjab.
BJP won 2 seats, DMK won 1 seat. Independent candidate Shankar Singh won on Rupauli seat of Bihar. pic.twitter.com/lJWtsVWI46— ANI (@ANI) July 13, 2024
Comments
Please login to add a commentAdd a comment