జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్, అజ్మీర్ లోక్‌సభ స్థానాలకు, మందల్‌గర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మరో సంవత్సరం(2019)లో లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఈ ఉప ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా సుమారు 40 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అజ్మీర్‌లో బీజేపీ నేత సన్వర్‌లాల్ జాట్ కుమారుడు రామ్‌స్వరూప్ లాంబా కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘుశర్మపై పోటీలో ఉన్నారు. అలాగే అల్వార్‌లో రాజస్థాన్ మంత్రి జశ్వంత్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ కరణ్‌సింగ్ యాదవ్‌పై పోటీ చేస్తున్నారు. మందల్‌గర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి శాంతిసింగ్ హడా, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ధాకడ్‌ల మధ్య పోటీ ఉండనుంది. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ తీరుపై వివరాలందించేందుకు ప్రిసైడింగ్ అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన కొత్త పోర్టల్‌ను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment