న్యూఢిల్లీ, సాక్షి; సార్వత్రిక ఎన్నికల హడావిడి ముగియగానే మరో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి తేదీలను బుధవారం విడుదల చేసింది.
పశ్చిమ బెంగాల్‌లో 4, హిమాచల్ ప్రదేశ్‌లో 3, ఉత్తరాఖండ్‌లో 2, బీహార్ తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ ఒక్కొ అసెంబ్లీ స్థానం.. మొత్తం 13 స్థానాల్లో ఉప ఎన్నికకు తేదీల్ని ప్రకటించింది. అంతేకాదు.. ఆ సీట్లు ఎందుకు ఖాళీ అయ్యాయనే కారణాలను కూడా వివరించింది.
ఏడు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల బై పోలింగ్ జులై 10వ తేదీన పోలింగ్ జరగనుంది. అలాగే.. జులై 13వ తేదీన కౌంటింగ్.. అదే రోజు సాయంత్రం ఫలితాల్ని వెల్లడిస్తారు.
ఇదీ చదవండి: మూడోసారి ప్రధానిగా మోదీ, తొలి సంతకం దేనిమీద అంటే..
Comments
Please login to add a commentAdd a comment