
మెదక్ బరిలో బీజేపీ
హైదరాబాద్: మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయనుంది. టీడీపీ, బీజేపీ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు నివాసంలో టీడీపీ, బీజేపీ నేతలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. పొత్తులో భాగంగా మెదక్ లోక్సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించామని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రమణ చెప్పారు.
పార్టీ అధిష్టానం ఆమోదంతో బీజేపీ అభ్యర్థిని ప్రకటించనుంది. ఈనెల 26న మెదక్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించి, 27న నామినేషన్ వేస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు.