'వరంగల్ సీటు బీజేపీకే ఇవ్వండి' | warangal loksabha by poll to bjp says rajeswara rao | Sakshi
Sakshi News home page

'వరంగల్ సీటు బీజేపీకే ఇవ్వండి'

Published Sun, Jun 7 2015 11:01 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

'వరంగల్ సీటు బీజేపీకే ఇవ్వండి' - Sakshi

'వరంగల్ సీటు బీజేపీకే ఇవ్వండి'

వరంగల్: వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీకే సీటు కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ టి. రాజేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వరంగల్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యమ్నాయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సెలవు ప్రకటించారని.. ఆ పార్టీ ఇక విశ్రాంతి తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.


రేవంత్ తీరు సరైంది కాదు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదని రాజేశ్వర్‌రావు అభిప్రాయపడ్డారు. బీజేపీ ఓటుకు నోటును వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొన్న టీఆర్‌ఎస్‌కు ఓటుకు నోటుపై మాట్లాడే అర్హత లేదన్నారు. టెక్నికల్‌గా ఇతర పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారిని ఎలా మంత్రులుగా సాగిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లోబరుచుకొందని రాజేశ్వరరావు దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement