సర్కారును ఇరుకున పెట్టండి
- తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు సూచన
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతాపార్టీతో కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, కీలకమైన ప్రజా సమస్యలపై నిలదీయాలని తెలంగాణ టీడీపీ నాయకులకు పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణ టీడీపీ నేతలు ఆదివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డిపట్ల వ్యవహరిస్తున్న తీరుపై స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని భావిస్తున్నారు. సోమవారం కూడా అదే పరిస్థితి కొనసాగితే మరిం త తీవ్రంగా స్పందించాలని యో చిస్తున్నారు. స్పీకర్‌పైన, లేదా ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రతిపాదన చేయగా, పార్టీ అధినేత అది సరికాదని సూచించినట్టు తెలిసింది. ఇప్పటికే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం అనే అంశంపై టీఆర్‌ఎస్‌కు చెందిన బీసీ ఎమ్మెల్యేలు టీడీపీపై ఎదురుదాడికి దిగారు.
బీసీనేత స్పీకర్ అయితే టీడీపీ సహించడం లేదన్న వాదనను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూ పాలని, సస్పెండ్ కావడం, గొడవకు దిగడం కూడదని బాబు హెచ్చరించినట్లు తెలిసింది. కలిసి ఉన్నామన్న సందేశాన్ని పంపించాలని బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్‌కు టీడీపీ నాయకత్వం సూచిం చినట్లు సమాచారం. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలిసింది. సోమవారం స్పీకర్‌ను కలిసి తమ హక్కులను కాపాడాలని కోరనున్నట్లు టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.