
సాక్షి, ఢిల్లీ: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. ‘‘తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుంది’’ అని రేవంత్ పేర్కొన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
సినీ హీరో అల్లు అర్జున్‌ని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం బన్నీ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానితో పాటు అక్కడ సెక్యూరిటీ వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ సాగుతోంది. వైద్య పరీక్షల కోసం ఈయనని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లనున్నారు. తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశముందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment