సాక్షి, హైదరాబాద్: హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని.. ప్రభుత్వాలే అనుమతులిచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఏమైపోవాలి?. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రా ఎలా చెబుతుంది. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’’ అని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘హైడ్రా దూకుడు పేదలపై కాకుండా బాధితులతో చర్చించండి. ఇతర భాగస్వామ్య పక్షాలను పరిగణనలో తీసుకోండి. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చివేస్తే వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి. అక్రమంగా భూములు అమ్మిన వారిని బాధ్యులను చేయాలి. రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డున పడేస్తే వాళ్ల బతుకులు ఏమైపోతాయి.’’ అంటూ లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘పాలకుల, అధికారుల అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి దళారులు దోచుకున్నారు. అన్ని అనుమతులున్న భవనాలను నేలమట్టం చేయడం బాధకరం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చే అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా నిర్ణయిస్తుంది. మూసీ పరివాహ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మంది జీవనోపాధి ఇక్కడే ఉంటుంది. దుందుడుకు విధానాలతో ముందుకు వెళ్లవద్దు’’ అని లేఖలో రేవంత్‌కు కిషన్‌రెడ్డి సూచించారు.
ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!
బ్యాంకులకు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు రుణ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవద్దు. కూల్చివేతలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారని లేఖలో పేర్కొన్న కిషన్‌రెడ్డి.. ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలితో గందరగోళానికి గురవుతున్నారన్నారు. అధికారులు ఎలాంటి ప్రకటనలు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని కిషన్‌రెడ్డి కోరారు. మీరు తీసుకునే నిర్ణయం అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని సీఎంకు కిషన్‌రెడ్డి సూచించారు.
‘‘ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందని పక్షంలో అవకాశం ఉన్నచోట పేదలు తమ కష్టాన్ని దారబోసి ఇళ్లను నిర్మించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన మోసానికి గురయ్యారు. సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించం. ఆక్రమణలపై, ఆక్రమ నిర్మాణాలపై చట్టబద్దంగా, న్యాయబద్దంగా చర్యలు ఉండాలన్నదే మా ఉద్దేశ్యం. హడావుడి చేసి, నిత్యం వార్తల్లో ఉండేందుకే ప్రభుత్వం అక్రమ నిర్మాణాల కూల్చివేత’’ అంటూ లేఖలో కిషన్‌రెడ్డి నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment