
సాక్షి, హైదరాబాద్: తాను పోటీ చేస్తున్న మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో పలు చోట్ల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ తరహా ఓట్లపై చర్యలు తీసుకో వాలని బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, భారత ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ల జాబితా పరిశీలించినపుడు పలు చోట్ల ఒకే ఇంటి నంబరుతో అనేక ఓట్లు ఉండటాన్ని తాను గుర్తించానని, ఇది అసాధ్యమని రేవంత్ వివరించారు. ఇలాంటి అనుమానాస్పద ఓట్లపై పరిశీలన జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment