state election officer
-
ఆ లావాదేవీల జాబితా ఇవ్వండి..
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా రాష్ట్రంలో అనుమానాస్పద, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు, ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) ముకేశ్‌కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. గత ఏడాది అక్టోబరు 1 నుండి రోజుకి రూ.10 లక్షలకు మించి.. గత 30 రోజుల కాలవ్యవధిలో రూ.50 లక్షలకు మించి లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాలని అన్ని బ్యాంకుల నోడల్ అధికారులను ఆయన కోరారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈసీఎంసీ) అమలు అంశాలను సమీక్షించేందుకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఎస్ఈసీ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉందన్నారు. అయితే, అంతకుమించి జరిగే వ్యయంపై పటిష్టమైన నిఘా ఉంటుందని, ఈ విషయంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషించి గుర్తించాలన్నారు. రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుండి జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఐటి శాఖతోపాటు ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు, వారి సంబంధీకులు లేదా రాజకీయ పార్టీల బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.లక్షకు మించి జరిపే లావాదేవీల వివరాలను కూడా అందజేయాలని ఎస్ఈసీ కోరారు. ప్రలోభాలపై నిఘా.. ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో అధిక మొత్తంలో నగదు, లిక్కరు, ఓటర్లను ప్రలోభపరిచే సామాగ్రి అక్రమ తరలింపుపై కూడా పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని ముకేశ్‌కుమార్ చెప్పారు. అలా తరలించే సమయంలో సీజ్ చేయబడిన వివరాలను రియల్ టైమ్ బేసిస్‌లో నివేదించేందుకు ఈసీఎంసీ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ అంశానికి సంబంధించి ఐటి, జీఎస్టీ, పోలీస్, ఎౖMð్సజ్ తదితర 22 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలు నిరంతరం పనిచేస్తున్నాయని, వీరు సీజ్‌చేసే నగదు, వస్తువుల వివరాలను ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తామన్నారు. అన్ని బ్యాంకుల ప్రతినిధులు ఈ యాప్‌ను పటిష్టంగా వినియోగించుకునేందుకు వీలుగా అందులోకి లాగిన్ కావాలని ఆయన సూచించారు. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు బ్యాంకులు తరలించే సొమ్మును అకారణంగా జప్తు చేయకుండా ఉండేందుకు ఈఎస్ఎంఎస్ యాప్‌ను వినియోగించుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా నగదు తరలింపునకు బ్యాంకులు అనుమతులు, రశీదు పొందవచ్చని, క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు ధ్రువీకరణ చేసుకునే వీలుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ రవీంద్రబాబు, అన్ని బ్యాంకుల ప్రతినిధులు మరియు డిప్యూటీ సీఈఓ కె. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెయిడ్ ఆర్టికల్స్‌పై కన్ను.. ఆయా మాధ్యమాల్లో ప్రచురితం, ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్‌పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో వాటి ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా కోరారు. ఎన్నికల సమయంలో ప్రసార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలు, చట్టాలు.. సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలన్నారు. ఈ విషయమై మీనా అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. అందుకు అన్ని మాధ్యమాల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉండే మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ (ఎంసీ అండ్ ఎంసీ) కమిటీలు ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తుంటాయన్నారు. నిర్దేశించిన రేట్ కార్డు ప్రకారం పెయిడ్ న్యూస్‌ను గణించి, ఆ వ్యయాన్ని సంబంధిత అభ్యర్థి ఖాతాలో వేస్తామన్నారు. ఇక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి కూడా అనుమతి పొందాల్సి ఉంటుందని, ఆ ఆర్డరు కాపీ నెంబరును ప్రకటనపై ముద్రించాల్సి ఉంటుందన్నారు. -
TS: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా వికాస్‌రాజ్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వికాస్‌రాజ్ ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రంలో ఎలాంటి ఇతర పోస్టుల్లో కొనసాగరాదని, అదనపు బాధ్యతల్లో సైతం ఉండరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వికాస్‌రాజ్ గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. -
కుప్పంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది: ఎస్ఈసీ నీలం సాహ్ని
సాక్షి, విజయవాడ: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని స్పందించారు. ఈ మేరకు మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. వెబ్‌కాస్టింగ్, వీడియో గ్రఫీ, సీసీటీవీ కెమెరాల నిఘాలో పోలింగ్ జరిగిందని నీలం సాహ్ని పేర్కొన్నారు. కుప్పంలో పోలింగ్ బూత్ వెలుపల చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. చిత్తూరు ఎస్పీ కుప్పంలో ఉండి, పరిస్థితిని శాంతిభద్రతలను స్వయంగా పర్యవేక్షించారని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులు ప్రతి బూత్‌కు వెళ్లి పోలింగ్ తీరును స్వయంగా పరిశీలించారని తెలిపారు. చదవండి: చంద్రబాబు స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు: మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీలు నియమించుకున్న ఏజెంట్లు అంతా పోలింగ్‌బూత్‌ల్లో ఉన్నారని ఎస్ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, రీ పోలింగ్ నిర్వహించమని ఎవరు కూడా కోరలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘానికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు అధికారులకు పంపించినట్లు, వారు వెంటనే తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి పంపించారని వెల్లడించారు. -
‘మల్కాజ్‌గిరిలో అనుమానాస్పద ఓట్లు’
సాక్షి, హైదరాబాద్: తాను పోటీ చేస్తున్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో పలు చోట్ల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ తరహా ఓట్లపై చర్యలు తీసుకో వాలని బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, భారత ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ల జాబితా పరిశీలించినపుడు పలు చోట్ల ఒకే ఇంటి నంబరుతో అనేక ఓట్లు ఉండటాన్ని తాను గుర్తించానని, ఇది అసాధ్యమని రేవంత్ వివరించారు. ఇలాంటి అనుమానాస్పద ఓట్లపై పరిశీలన జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు. -
ఎన్నికల పారదర్శకతకు వెబ్‌కాస్టింగ్
-
ఏపీ ఓటరు జాబితాలో పొరపాట్లను గుర్తించాం: సీఈఓ
సాక్షి, అమరావతి: రానున్న సార్వత్రిక, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడానికి వెబ్ కాస్టింగ్ పెడుతున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అదికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ, డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగిస్తున్నామన్నారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయన్న రాజకీయ పార్టీల ఫిర్యాదులపై మూడు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలలో అధికారులు తనిఖీలు చేశారన్నారు. ఒక్క ఓటు తొలగించాలన్నా కలెక్టర్, ఎన్నికల సంఘం అనుమతి తప్పకుండా ఉండాలన్నారు. సుమోటోగా ఓట్లను తొలగించడానికి వీల్లేదని అధికారులకు సూచించారు. నకిలీ ఓటర్లను తొలగిస్తామని, అయితే దానికి కాస్త సమయం కావాలన్నారు. ఇప్పటికే ఓటర్ జాబితాలో పొరపాట్లను గుర్తించామని, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్సీ ఓటర్ జాబితా సిద్దమైందని అయితే.. ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు ఎలక్షన్ కోడ్ వర్తించదన్నారు. పట్టభద్రుల, టీచర్ల ఎన్నికలకు పాక్షికంగా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. -
ఏపీలో అక్రమ ఓటర్లు
-
ఏపీలో 59.18 లక్షల అక్రమ ఓటర్లు
-
ఏపీలో 59.18 లక్షల అక్రమ ఓటర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్ల జాబితాలో అనేక లోపాలు, అక్రమాలు ఉన్నాయని ‘ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ టీమ్ (వాస్ట్)’ ప్రతినిధులు తుమ్మల లోకేశ్వరరెడ్డి, నలివెల సురేష్‌కుమార్‌రెడ్డిలు అన్నారు. ఈ నెల 11న ప్రచురితమైన కొత్త ఓటర్ల జాబితాను పరిశీలిస్తే 175 నియోజకవర్గాల్లో 59,18,631 ఓటర్లు నమోదు అక్రమంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే రెండు నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్లు 39.11 లక్షల మంది, రెండు తెలుగురాష్ట్రాల్లో ఓటు కలిగిన వారు 20.07 లక్షల మంది ఉన్నారని చెప్పారు. నకిలీ ఓటర్ల నమోదు వివిధ రకాలుగా ఉన్నదని, కొన్ని పునరావృతం అయితే మరికొన్ని డూప్లికేట్ అయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఓటర్ల వివరాల్లో తప్పులు దొర్లాయని చెప్పారు. వీటిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎన్నికల అధికారిని వాస్ట్ ప్రతినిధులు కలిసి అక్రమ ఓట్ల వివరాలతో రూపొందించిన నివేదిక ఇచ్చారు. ఆ తరువాత మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. ఓ ఓటరుకు 351 ఏళ్ల వయసు ఉన్నట్టుగా జాబితాలో నమోదు చేశారని, 18 సంవత్సరాలలోపు వారిని కూడా ఓటర్లుగా చేర్చారని తెలిపారు. ఇంటి నంబర్లు లేకుండా కూడా పలువురి ఓట్లను నమోదు చేశారని తెలిపారు. నకిలీ ఓట్లను తాము 12 రకాల పద్ధతుల ద్వారా గుర్తించామని తెలిపారు. ఒకే ఓటర్ ఐడీతో ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయని, ఇటువంటి ఓటర్లు 9,552 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఇంటి నంబరు, జెండర్ ఒకేలా ఉండి వయసులో మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 52,180 ఉన్నారని తెలిపారు. ఇతర వివరాలు ఒకేలా ఉండి జెండర్ మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 1,224 ఉన్నారని, ఇతర వివరాలు ఒకేలా ఉండి తండ్రి లేదా భర్త పేరు మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 1,78,868 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు ముందుకు, వెనుకకు మారిన నకిలీ ఓటర్లు (ఉదాహరణకు వరలక్ష్మి కొండేటి– కొండేటి వరలక్ష్మి) వంటివి 1,69,448 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు ఒకే విధంగా ఉండి, ఇతర వివరాలు వేరే విధంగా ఉన్న ఓటర్లు 25,17,630 ఉన్నారని తెలిపారు. ఇతర వివరాలు ఒకేలా ఉండి ఇంటి నంబరులో మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 4,49,126 ఉన్నారని, ఓటరు పేరు పలకడానికి ఒక రకంగా, ఒకటి రెండు అక్షరాల మార్పులతో ఉండే నకిలీవి 2,36,626 ఉన్నాయని వివరించారు. ఇంటి నంబరు తప్పు ఉన్న ఓటర్లు 2,15,119 ఉన్నారని చెప్పారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరుతూ దానికి సంబంధించిన ఆధారాలను అందజేశారు. -
లక్ష్మమ్మవ్వ సేవలో భన్వర్‌లాల్
ఆదోని అర్బన్: శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్, ఆయన సతీమణి మణి సోమవారం దర్శించుకున్నారు. దేవాలయం ధర్మకర్త రాచోటి రామయ్య వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అనంతరం భన్వర్‌లాల్ దంపతులను శాలువా, పూలమాలతో సన్మానించారు. అక్కడి నుంచి వీరు మంత్రాలయం బయలుదేరి వెళ్లారు.