
సాక్షి, హైదరాబాద్ : తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలపాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్ కేసుల వివరాలు పొందుపరిచే నిమిత్తం ఆర్టీఐని సమాచారం కోరగా వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ, ఆర్టీఐ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేరుస్తున్నట్లు తెలిపారు. తనను టార్గెట్ చేసుకుని పోలీసులు అక్రమంగా క్రిమినల్ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా రేవంత్ రెడ్డి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల(నవంబరు) 6కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment