రేవంత్‌ వ్యవహారంపై లోకేష్‌ ఏమన్నారంటే..? | lokesh replied on revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌ వ్యవహారంపై లోకేష్‌ ఏమన్నారంటే..?

Published Wed, Oct 18 2017 2:19 PM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM

 lokesh replied on revanth reddy - Sakshi

సాక్షి, అమరావతి : తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి పార్టీ మారుతారన్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్‌ స్పందించారు. లోకేష్‌ పార్టీ మారుతారనే వార్తలు ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేశారు. రేవంత్‌ పార్టీ మారతారని వస్తున్న వార్తలపై లోకేష్‌ వివరణ ఇచ్చారు. పార్టీ మారుతానని రేవంత్ ఎక్కడా చెప్పలేదన్నారు. కోర్టు పని మీద ఢిల్లీ వెళ్లానని రేవంత్ తనతో చెప్పారన్నారు. కంభంపాటి రామ్మోహన్‌రావు రేవంత్‌ను కలిసిన సంగతి తనకు తెలియదని ఆయన చెప్పారు.

మీడియాలో చేసిన హడావుడికి తానెందుకు స్పందించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ తనతో చర్చలు జరుపుతున్నది వాస్తవమేనని ఓ పక్క రేవంత్‌రెడ్డి చెప్పినప్పటికీ లోకేష్‌ ఆ విషయాల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. టీఆర్‌ఎస్‌తో తెలంగాణ టీడీపీ పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు, ఆ మేరకు చర్చలు జరుపుతున్నట్లు మీడియాలో హల్‌చల్‌ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో లోకేష్‌ వివరణ ఇచ్చారు.

రేవంత్‌ వ్యవహారంపై వస్తున్న వార్తలపై లోకేష్‌ వివరణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement