
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్–బీజేపీల ఫైట్ ఉత్తుత్తిదేనని తాము చెప్తున్న మాటలు గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలతో రుజువయ్యాయని ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని రాష్ట్ర బీజేపీ నేతలు అంటుంటే, మొన్నటివరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ కాళేశ్వరం అద్భుతమంటూ ప్రశంసించడం ఏంటని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.