సాక్షి, హైదరాబాద్: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జీవో ఇచ్చారంటూ రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అధికార పార్టీది తెలంగాణ వాదం కాదు.. కాంగ్రెస్ వాదం అంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వారికి పార్టీ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రేపు(శనివారం) మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి పై దాడి జరిగింది. బీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాలను సమానంగా చూశాం. ప్రజల ఆమోదం ఉంటే సీఎంకు భయం ఎందుకు?. విగ్రహం తయారు చేసే వరకు ఎందుకు రహస్యంగా ఉంచారు’’ అంటూ కవిత నిలదీశారు.
జాగృతి తరపున మేము ఎన్నో ఏళ్లుగా చేస్తున్నాము. మేధావుల అభిప్రాయం తీసుకుని మరింత దూకుడుగా ముందుకు వెళ్తాం. సీఎం రేవంత్ సంకుచిత తత్వంతో వ్యవహరిస్తున్నారు. మేము అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశాము. సోనియా దగ్గర మార్కుల కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. కాంగ్రెస్ కొత్తగా చేసింది ఒక్క తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇది పిరికి ప్రభుత్వం. కార్యకర్తల నుంచి నేతల వరకు అక్రమ కేసులు పెడుతోంది. మేము అక్రమ కేసులకు భయపడం’’ అని కవిత చెప్పారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment