హైదరాబాద్, సాక్షి: నగరంలో ఇప్పుడు ఎటు చూసినా.. హైడ్రా పేరే వినిపిస్తోంది. చెరువుల్ని మింగి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్లంతా.. నోటీసులు, కూల్చివేతల ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో.. హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు అధికారులు డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో.. ఫిర్యాదులు వెల్లువెత్తడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అటువంటి అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.
గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సీఎంవోకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ సీరియస్‌గా స్పందించారు.
ఇదీ చదవండి: హైడ్రా అంటే ఒక డ్రామా: ఎంపీ ఈటల ఫైర్
Comments
Please login to add a commentAdd a comment