
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం వ్యవహరిస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్-బీజేపీలపై మండిపడ్డారు.
‘ వారెవా తోడు దొంగల నాటకం. కిషన్ రెడ్డి గారూ.. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?,లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?,హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది మేము!,రేవంత్‌ను మొదటి అభినందించింది మీరైతే.. మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేము.
అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి?, ఎవరిని కాపాడటం కోసం? ఎవరిని ముంచడం కోసం? మరెవరిని వంచించడం కోసం? ,రేవంత్‌ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు. లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగానామాలు.. మీ పాలి'ట్రిక్స్' ను గమనిస్తోంది తెలంగాణ..ఆట కట్టిస్తుంది సరైన వేళ’ అంటూ ట్వీట్ చేశారు.
రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం
దోస్తును కాపాడేందుకు 'చీకటి' రాజకీయం
వారెవా తోడు దొంగల నాటకం!
కిషన్ రెడ్డి గారూ..
ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?
లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?
హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..
బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది…— KTR (@KTRBRS) November 17, 2024
Comments
Please login to add a commentAdd a comment