సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యా గాంధీ, రాహుల్‌ల అపాయింట్‌మెంట్ లభిస్తే ఢిల్లీ వెళ్లి వారికే తన ఆవేదనను చెప్తానని, తనకు అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యత పార్టీ పెద్ద లదేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో జరుగు తున్న పరిణామాలకు మనస్తాపం చెంది తాను రో డ్డు మీదకు వచ్చానని చెప్పారు. జగ్గారెడ్డి రోడ్డు మీ దకు ఎందుకు వచ్చాడో.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ తేల్చాలని పేర్కొన్నా రు.
తనకు కాంగ్రెస్ పార్టీపై, పార్టీ నాయకత్వంపై కోపం లేదని, తన ఆవేదన చెప్పుకోవాలనేదే ప్రధా న ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇంకెవరితో సమావే శమయ్యేది లేదని, తన ఆట ప్రారంభమయిందని, సింగిల్‌గా ఆడడం తనకు ఇష్టమని, తన ఆట ఎలా ఉంటుందో చూపిస్తానని వ్యాఖ్యానించారు. తన సమస్య టీకప్పులో తుపాన్ లాంటిదని పీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యానించడంలో తప్పు లేదని, కానీ తన పంచాయ తీకి మూలం ఎక్కడ ఉందో వెతకడం లేదని అన్నారు. తాను పార్టీలో ఉన్నా.. వెళ్లిపోయినా ఇబ్బంది లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ మాట్లాడినట్టు తన దృష్టికి వచ్చిందని, తన సమస్య గురించి కాంగ్రెస్ పార్టీలోని ఎవరూ సిల్లీగా మాట్లాడవద్దని సూచించారు. దమ్మున్నోడు ఎవరు పార్టీ పెట్టినా తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
అందుకే కాంగ్రెస్ మిత్రపక్షాలను కలుస్తున్నారు
యూపీఏ అనుబంధ పార్టీల నేతలను కలవడం ద్వారా తాను బీజేపీ మనిషిననే అభిప్రాయం పోగొ ట్టుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను కలుస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీతో నేరుగా కొట్లాడుతున్నది కేవలం స్టాలిన్, మమతా బెనర్జీలే అని చెప్పారు. రైతు ఉద్యమకారుడు టికాయత్ కూడా కేసీఆర్ బీజేపీ మనిషే.. అని చెప్పిన విష యాన్ని జగ్గారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment