సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగి సేంతవరకు టీపీసీసీ అధ్య క్షుడిగా రేవంత్‌రెడ్డినే కొన సాగించాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు రేవంత్‌రెడ్డిని దించేయాలని పార్టీలో ఎవరూ కోరుకోవడం లేదని చెప్పారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షు డిగా ఎవరున్నా పార్టీలోని నేతలందరినీ కలుపుకొని పనిచేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పేర్కొన్నారు.
పాదయాత్ర చేయాలనే అభిప్రాయం పార్టీలో ఎవరికైనా ఉండవచ్చని, కానీ పీసీసీ అధ్య క్షుడికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తే మనస్ఫూర్తిగా సహ కరిస్తానని తెలిపారు. అయితే రేవంత్ ఏ నిర్ణయం విషయంలోనూ తమను సంప్రదించడం లేదని విమర్శించారు. రేవంత్ ఇటీవల చేసిన కొన్ని తొందరపాటు వ్యాఖ్యల గురించి పార్టీ భేటీలో అడుగు తానని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి ఒక నటుడని, ఆయన గురించి అర్ధం కాదని జగ్గారెడ్డి అన్నారు.
డ్రామాలు ఓటు బ్యాంకును మార్చవు
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మొదటి స్థానంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉందని జగ్గారెడ్డి అభి ప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాము మొదటి స్థానానికి వెళ్లి అధికారంలోకి రావాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, టీఆర్‌ఎస్ రెండో స్థానా నికి వెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీ హడావుడి చేస్తున్నా, హైటెక్ డ్రామాలు ఓటు బ్యాంకును మార్చలేవని పేర్కొన్నారు.
సంగారెడ్డి రాంనగర్ వరకు మెట్రోరైల్
మెట్రో రైలును మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడిగించాలని జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసినట్టు తెలిపారు. బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు, పోతిరెడ్డిపల్లి మీదుగా సంగారెడ్డిలోని రాంనగర్ వరకు మెట్రో రైల్ పొడి గించాలని కోరారు. అలాగే ఉప్పల్ మీదుగా యాద గిరిగుట్ట వరకు మెట్రో రైలును పొడిగించాలని, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన గుట్ట వరకు ఈ రైలును పొడగించడం వల్ల పెద్ద ఎత్తున భక్తు లకు సౌకర్యంగా ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment