సాక్షి, గాంధీభవన్: టీపీసీసీ చీఫ్ పదవి బీసీ నేతకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇదే సమయంలో తన మనసులోని మాటను బహిర్గతం చేశారు. తాను కూడా పీసీసీ చీఫ్ కావాలనుకుంటున్నట్టు తెలిపారు. ఎప్పటికైనా పీసీసీ చీఫ్ అవుతానని కామెంట్స్ చేశారు.
కాగా, జగ్గారెడ్డి శనివారం గాంధీభవన్‌లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘కొత్త పీసీసీ చీఫ్ పార్టీలో అందరినీ కలుపుకునిపోతారని భావిస్తున్నాను. పార్టీ లైన్‌లో పనిచేసిన నేత మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ పదవి బీసీ నేతకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాను. తెలంగాణలో ముఖ్యమంత్రి రెడ్డి సామాజికి వర్గానికి చెందిన నేత కావడంతో పీసీసీ బీసీ నేతకు ఇచ్చారు. నేను కూడా ఏదో ఒకరోజు పీసీసీ చీఫ్ అవుతాను. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అధిష్టానం పీసీసీ ఇచ్చింది. భవిష్యత్‌లో రెడ్డిలకు పీసీసీ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే నేను ప్రయత్నాలు చేస్తాను.
కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి చాలా హ్యాపీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఫ్రీడమ్ ఉంటుంది. బీజేపీలో స్టేట్ ప్రెసిడెంట్ కావాలన్నా కష్టమే. ఎవరికీ వస్తుందో తెలియదు. ఎప్పుడు పోతుందో తెలియదు. బీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీ.. అందులో పార్టీ ప్రెసిడెంట్ పోస్టు ఉండదు. బీసీ కమిషన్ నియామకం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రైతుల పట్ల పూర్తి అవగాహన ఉన్న నేత కోదండరెడ్డికి రైతు కమిషన్ ఇచ్చారు. వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment