
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు తన ఫోటోలు మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియలో తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను జగ్గారెడ్డి ఖండించారు. కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా పీసీసీ చీఫ్ పదవి ఆశించానని, అయితే రాహుల్‌తో పోట్లాడే స్థాయి తనది కాదని అందుకు మౌనంగా ఉన్నట్లు చెప్పారు.
తన పంచాయితీ రేవంత్‌తో మాత్రమేనని కాంగ్రెస్‌తో కాదని చెప్పారు. అందర్నీ కలుపుకుని పోయే తత్వం రేవంత్‌కు ఉందా అని ప్రశ్నించాడు. 20 రోజుల క్రితం రేవంత్ ఫోన్ చేశారని, మెదక్ సీఎస్‌ఐ చర్చికి వెళ్తన్నట్లు చెప్పినట్లు తెలిపారు. కానీ దామోదర రాజనర్సింహతో మరో రకంగా చెప్పారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment