
సాక్షి, హైదరాబాద్: మే 7వ తేదీన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లేం దుకు అనుమతి ఇవ్వాలని, లేదంటే సీఎం కేసీ ఆర్‌ను అయినా అక్కడకు తీసుకెళ్లాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గా రెడ్డి డిమాండ్ చేశారు. ఉస్మానియాలోకి ఎవరూ రాకూడదంటూ 2021లో సర్క్యులర్ ఇచ్చామని చెపుతున్న వర్సిటీ వర్గాలు.. ఆ సర్క్యులర్‌ను ఇన్నాళ్లూ బయటపెట్టకుండా ఇప్పుడు రాహుల్ పర్యటన అనగానే ఎందుకు విడుదల చేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీని ఓయూ సందర్శనకు అనుమతించకపోవ డం దురదృష్టకరమని, ఇది తాము అవమానంగా భావిస్తున్నామని శనివారం గాంధీభవన్‌లో విలేక రులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుపై స్పష్టత వచ్చేది
ఉస్మానియాలో తాము రాజకీయం చేయబోమని, పార్టీ కండువాలు, జెండాలు లేకుండా వస్తామని, రాహుల్‌గాంధీ కేవలం విద్యార్థులతో మాట్లాడి వెళ్లిపోతారని చెప్పినా అనుమతి ఇవ్వలేదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ ఓయూకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి ఉం టే వారి భవిష్యత్తుపై మరింత స్పష్టత వచ్చేదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు యూని వర్సిటీలకు వెళ్లారని, ఇప్పుడు వెళ్లడంలో ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. ఉస్మాని యాతో పాటు ఇతర వర్సిటీల్లో పరిస్థితి సజావుగా ఉంటే కేసీఆర్ ఓయూకి ఎందుకు వెళ్లడం లేదని, అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు.
తాను సమైక్యవాదినని బహిరంగంగా అప్పుడే చెప్పానని, కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక సమైక్యవాదులను కేసీఆర్ తన పక్కన పెట్టుకున్న విషయం తనను విమర్శించే వారికి కనిపించడం లేదా అని నిలదీశారు. కేసీఆర్‌ను ఉరికించి కొడతానన్న తలసాని, చంద్రబాబు ఫాలోవర్ దయాకర్‌రావు, దానం నాగేందర్, పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారిని సంకలో పెట్టుకున్నా రని ఎద్దేవా చేశారు. తనను కొడతామని అంటున్నా రని, యూనివర్సిటీకి తాను ఒక్కడినే వస్తానని చేత నైతే వచ్చి కొట్టాలని జగ్గారెడ్డి సవాల్ చేశారు. తాను బూతులు తిట్టడం మొదలుపెడితే టీవీల్లో వేయ లేరని, వినేవాడు చావాల్సి వస్తుందని అన్నారు.