Clashes Between Police And Congress Leaders In Hyderabad At ED Office - Sakshi
Sakshi News home page

HYD: ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

Published Tue, Jun 14 2022 6:29 PM | Last Updated on Tue, Jun 14 2022 7:39 PM

Clashes Between Police And Congress Leaders In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఈడీ విచారించడంపై పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఇక, హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌ నేతలు ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం నిరసనల్లో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జగ్గారెడ్డి ప్రయత్నించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు పెట్రోల్‌ బాటిల్స్‌తో వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు.. జగ్గారెడ్డిని అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఈడీ ఆఫీసు ఎదుట ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement