
బీజేపీ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. జగ్గారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కాల్పులకు బాధ్యులు ఎవరూ అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే వరంగల్ రాకేశ్ ఇంటికి రావాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ రద్దు అయ్యే వరకు బండి సంజయ్, కిషన్‌రెడ్డిని అడ్డుకుంటామన్నారు. రాకేశ్ మృతదేహంపై టీఆర్‌ఎస్ జెండా ఎందుకు కప్పారు?. బీజేపీ ప్రభుత్వం రాకేశ్ మృతికి కారణమైతే.. టీఆర్‌ఎస్ శవయాత్ర రాజకీయం చేసింది’’ అని విమర్శించారు.
ఇది కూడా చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద టెన్షన్.. టెన్షన్
Comments
Please login to add a commentAdd a comment