హైదరాబాద్, సాక్షి: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే.. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మళ్లీ క్రియాశీలకంగా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత రెండు మూడు రోజులుగా చురుకుగా కనిపిస్తున్నారాయన. సంగారెడ్డిలో తాను ఓడిపోతానని ముందే ఊహించానని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా ఇవాళ గాంధీభవన్‌లో మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై మండిపడ్డారాయన.
తెలంగాణ వ్యాప్తంగా మహాలక్ష్మి స్కీమ్ ఉచిత బస్సు ప్రయాణానికి అనూహ్య స్పందన లభిస్తోంది. మహిళలంతా ఈ పథకంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్లకు బస్సు ప్రయాణం తెలియదు. బెంజ్ కార్ల లో తిరిగే వాళ్లకు.. పేదల సమస్యలు ఏం తెలుసు?. బీఆర్‌ఎస్ నేతలకు తెలిసింది అమరవీరుల స్థూపం మాత్రమే. రుణమాఫీ పై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీష్ లకు లేదు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్‌రావు రెచ్చిపోతున్నారు నేను గెలిచి ఉంటే.. అసెంబ్లీలో వీళ్లద్దరినీ ఓ ఆట ఆడుకునేవాడ్ని.
బీఆర్‌ఎస్‌ది కేసీఆర్ పాలన. కాంగ్రెస్‌ది ప్రజా పాలన. ప్రజాపాలన అనే సంస్కారం బీఆర్‌ఎస్‌కు లేదు. కేసీఆర్ కుటుంబానికి ఆరోగ్య శ్రీ అవసరం లేకపోవచ్చు.. కానీ పేదలకు ఆ అవసరం ఉంది. సెక్రటేరియట్ లో 9 ఏళ్ల ఫైల్స్ అన్నీ పెండింగ్ లొ ఉన్నాయి. మా మంత్రులు వాటి బూజు దులుపుతున్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి పోయారు. తెలంగాణ ప్రజలు అప్పు చేయమని అడిగారా?. కేబుల్ బ్రిడ్జి కట్టి మీరే ఇంత చెప్పుకుంటే ఓఆర్ఆర్ సృష్టి కర్త వైఎస్ఆర్ గురించి మేం ఇంకెంత చెప్పాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీ ఇంటికి పోయింది కేసీఆర్ కుటుంబం కాదా?. బీఆర్ఎస్ మాట ఇచ్చి తప్పినందుకు కోర్టులో కేసు వేస్తాం. కేసీఆర్ కుటుంబం 420 కాబట్టే ఓడించి ఇంట్లో కూర్చో బెట్టారు. కేటీఆర్, హరీష్ రావుల కోసం 840 చట్టం తేవాలేమో అని జగ్గారెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment