సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. అలాగే, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతల అరెస్ట్ అప్రజాస్వామికం.. వారిని వెంటనే విడుదల చేయాలని కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..
‘ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు !
పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు !
పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు !
గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు !
ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు !
ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు !
ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు !
ప్రజలపై కేసులు.. ప్రజాప్రతినిధులపై కేసులు
కేసులు .. కేసులు .. కేసులు.. కాసులు మీకు-కేసులు మాకు
సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు
మాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గార్లతోపాటు మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నాయకుల అరెస్ట్ లు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చెయ్యాలి...
జాగో తెలంగాణ జాగో’ అంటూ కామెంట్స్ చేశారు
ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు !
పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు !
పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు !
గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు !
ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు !
ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు !…— KTR (@KTRBRS) December 5, 2024
ఎమ్మెల్యే @KaushikReddyBRS ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ పరార్... సీఐ పారిపోతారు...
ఎంత అధికార పార్టీకి ఊడిగం చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేను అధికారికంగా మీ ఆఫీసులోనే కలిసేందుకు కూడా భయమా?
పట్టుకొని నిలదీస్తే... అక్రమ కేసులా? ఇదెక్కడి రాజకీయం? ఇదేనా ప్రజా…— KTR (@KTRBRS) December 5, 2024
Comments
Please login to add a commentAdd a comment