మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా? | TPCC Working President Jagga Reddy Fires On BRS During Medak District Bike Rally, Details Inside| Sakshi
Sakshi News home page

మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?

Published Sat, May 4 2024 1:24 PM | Last Updated on Sat, May 4 2024 1:45 PM

TPCC Working President Jagga Reddy Fires On BRS

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి వ్యాఖ్యలు 

నర్సాపూర్‌ (మెదక్‌): ‘‘మొన్ననే పెళ్లి చేసిండ్రు...అప్పుడే పిల్లలు పుడతాలేరంటే ఎలా..’’అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శుక్రవారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో చేపట్టిన బైక్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. 

తమకు పావలా వడ్డీ రుణం రావడం లేదని, ఇళ్లు రాలేదని తదితర హామీలను మహిళలు ప్రశ్నించగా..బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వడంలో మోసం చేసిందని విమర్శించారు. ప్లాట్లు ఉన్న దళితులకు తమ ప్రభుత్వం రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5లక్షలు ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ‘‘మొన్ననే మాకు పెళ్లి చేసిండ్రు. అప్పుడే పిల్లలు పుడుతలేరంటే ఎట్లా? మూడు నెలలే అయింది, ముచ్చటగా 3 నిద్రలు చేసినం. తొందర పడకండి, జెరా టైమియ్యిండ్రి, హామీ లన్నీ అమలు చేస్తాం’’అని జగ్గారెడ్డి చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement