సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యూనిట్‌కు 50 పైసలు పెంచి పేదలపై భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రో భారం పెరిగిందని, దీంతో అన్ని రకాల నిత్యావసరాలపై ప్రభావం పడిందని విమర్శించారు.
దీనిపై పార్లమెంట్‌లో సోనియాగాంధీ నిలదీశారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. కాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్టీ పరంగా మంచి పనులు చేస్తే ప్రశంసిస్తానని, పొరపా టు చేస్తే ప్రశ్నిస్తానని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. సోనియాగాంధీకి తాను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలియదని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు.
ఇంటర్ బోర్డు ముందు ధర్నా ఎట్లా చేశావు అంటే.. హైదరాబాద్ ఎవరి జాగీరు కాదని, వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎక్కడికైనా వెళ్తానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో అంతర్గత పంచా యితీ కామన్ అని, పంచాయితీ లేకుంటే కాం గ్రెస్ వాళ్లంతా సైలెంట్‌గా ఉంటున్నారని ప్రజ లు అనుకుంటారని జగ్గారెడ్డి చమత్కరించారు
Comments
Please login to add a commentAdd a comment