
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన రాఫెల్ కేసులో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుప్రీంకోర్టు... కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చిన నేపథ్యంలో.. శుక్రవారం బీజేపీ కార్యకర్తలు న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీనుద్దేశించి చౌకీదార్ చోర్ హై (కాపలదారుడే దొంగ) అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
Delhi: BJP holds a protest outside All India Congress Committee (AICC) office, demanding an apology from Rahul Gandhi over his remarks on #Rafale verdict. pic.twitter.com/GkxTb264Ns
— ANI (@ANI) November 15, 2019