మోదీజీ.. సిగ్గనిపించడం లేదా?: రాహుల్‌ గాంధీ | Rahul Gandhi Qutioned PM Modi On Bilkis Bano Convicts Freed | Sakshi
Sakshi News home page

మోదీజీ.. సిగ్గనిపించడం లేదా?: రాహుల్‌ గాంధీ

Published Fri, Aug 19 2022 6:56 AM | Last Updated on Fri, Aug 19 2022 7:35 AM

Rahul Gandhi Qutioned PM Modi On Bilkis Bano Convicts Freed - Sakshi

న్యూఢిల్లీ: అత్యాచార ఘటనల్లో దోషులకు అధికార బీజేపీ అండగా నిలుస్తోందని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. మహిళల పట్ల బీజేపీ వైఖరి ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇలాంటి రాజకీయాలు చూస్తే మీకు సిగ్గనిపించడం లేదా? అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సూటిగా ప్రశ్నించారు. ఉన్నావో, హథ్రాస్, కథువా తదితర సంఘటనల్లో నేరస్తులకు బీజేపీ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు.

గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై అత్యాచారానికి పాల్పడినవారిని జైలు నుంచి విడుదల చేశారని ఆక్షేపించారు రాహుల్‌ గాంధీ. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశారు. బిల్కిస్‌ బానోపై గ్యాంగ్‌రేప్‌ కేసులో దోషులైన 11 మందిని జైలు నుంచి విడుదల చేయడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సైతం తప్పుపట్టారు.

ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్‌ ఆవేదన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement