bilkis banu
-
బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలని 11 మంది దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లలో న్యాయంలేదని పేర్కొంది. దోషులు ఆదివారం నాటికి జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దోషులలో ఒకరైన గోవింద్‌భాయ్.. తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యతను పేర్కొంటూ గడువు పొడిగింపును కోరాడు. తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడనని ఆయన పేర్కొన్నాడు. మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని, ఆరు వారాల పొడిగింపును కోరాడు. మూడవ దోషి మితేష్ చిమన్లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అఘాయిత్యం జరిగింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే వీళ్లను విడుదల చేసింది. అయితే.. ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు, కారణం ఏంటంటే.. -
బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?
బిల్కిస్ బానో కేసులో ఖైదీల క్షమాభిక్ష చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దోషులకు క్షమాభిక్ష పెట్టే అర్హత గుజరాత్ సర్కార్‌కు లేదని స్పష్టం చేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది అత్యాచార నిందితుల రిలీజ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థ మీద ఆశలు చిగురించాయి దేశవ్యాప్తంగా సంచనల రేపిన ఈ తీర్పు బాధితురాలితోపాటు, సామాజిక కార్యకర్తలు మహిళాసంఘాలకు, మానవ హక్కుల సంఘాలకు ఊరటనిచ్చింది. మరోవైపు పలువురి పోరాటం,మద్దతు,మీడియా సాధించిన విజయని బిల్కిస్ బానో తరపున పిటీషన్ దాఖలు చేసిన వారు పేర్కొన్నారు. న్యాయం వ్యవస్థపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయని రూప్‌రేఖా వర్మ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు మహిళలు నిరాశ పడకుండా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చిందన్నారు. ఈ కేసులో సర్ఫరోషి ఫౌండేషన్ ఫౌండర్ ప్రముఖ జర్నలిస్టు రేవతి లాల్, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ, కమ్యూనిస్ట్ నాయకురాలు మాజీ ఎంపీ సుభాషిణి అలీ, బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, మాజీ ఐపీఎస్ అధికారి మీరన్ చద్దా బోర్వాంకర్ కూడా ఈ మినహాయింపును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ కేసులో ఆదినుంచీ న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన బిల్కిస్ బానో, గుజరాత్ కోర్టు తీర్పు తరువాత ఏ మాత్రం ధ్యైర్యాన్ని కోల్పోకుండా, నిరాశ చెందకుండా సుప్రీంకోర్టు గడప తొక్కిన వైనం పలువురి ప్రశంసలు దక్కించుకుంది. వీరితో పాటు మరోపేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె మరెవ్వరో కాదు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించిన జస్టిస్ బీవీ నాగరత్న. ఇంతకీ ఎవరీ నాగరత్న? ఎవరీ జస్టిస్ బీవీ నాగరత్న బిల్కిస్ బానో రేపిస్టులను మళ్లీ జైలుకు పంపిన ఎస్సీ జడ్జి బీవీ నాగరత్న ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసిన రిమిషన్ ఉత్తర్వులను రద్దు చేసిన సుప్రీం న్యాయమూర్తి బీవీ నాగరత్న దోషులు రెండు వారాల్లో లొంగి పొవాలంటూ ఆదేశాలిచ్చి సంచలనం రేపారు. 1962 అక్టోబర్ 30న జన్మించిన జస్టిస్ బెంగుళూరు వెంకటరామయ్య నాగరత్న ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. గతంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. దివంగత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య కుమార్తె.కర్ణాటకకు చెందిన తొలి సుప్రీం న్యాయమూర్తి కూడా. మాండ్య జిల్లా, ఎంగలగుప్పె చత్ర గ్రామానికి చెందిన నాగరత్న న్యూఢిల్లీలోని భారతీయ విద్యాభవన్‌లో విద్యను అభ్యసించారు.1984లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని జీసస్ అండ్ మేరీ కళాశాల నుండి BA హిస్టరీ పట్టా తీసుకున్నారు. 1987లో న్యాయ పట్టా పొందారు. న్యాయవాద వృత్తి జస్టిస్ నాగరత్న అక్టోబర్ 28, 1987న కర్ణాటక బార్ కౌన్సిల్లో చేరి న్యాయవాద వృత్తి చేపట్టారు. రాజ్యాంగ, వాణిజ్య, బీమా, సేవ, పరిపాలనా మరియు ప్రజా చట్టం, భూమి మరియు అద్దె చట్టాలు, కుటుంబ చట్టం మరియు మధ్యవర్తిత్వంలో నిపుణత సాధించారు. ఫిబ్రవరి 18, 2008న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగాను, ఫిబ్రవరి 17, 2010న శాశ్వత న్యాయమూర్తిగాను నియమితులయ్యారు. అనంతరం 2021 ఆగస్టులో భారత సుప్రీంకోర్టుకు నియమితులయ్యారు. జస్టిస్ నాగరత్న2027, సెప్టెంబరులో కేవలం 36 రోజుల వ్యవధిలో భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (CJI) కావాల్సి ఉంది. కీలక తీర్పులు కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి పలు కీలక తీర్పులను వెలువరించిన నాగరత్నం 2012లో ఎలక్ట్రానిక్ మీడియాను నియంత్రించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రసార మాధ్యమాలను నియంత్రించేందుకు స్వయం ప్రతిపత్తి, చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరిన ఆమెకే దక్కింది. నోట్ల రుద్దు చట్ట విరుద్ధం: ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, నోట్ల రద్దుపై ఆమె అభిప్రాయాలు ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన అత్యంత ప్రముఖమైనదిగా పేరొంది. 2016 నవంబరు నాటి నోట్ల రద్దు నిర్ణయంపై, సుప్రీంకోర్టు బెంచ్‌లోని ఇతర నలుగురు న్యాయమూర్తులు డీమానిటైజేషన్ సమర్థించగా మెజారిటీ అభిప్రాయానికి భిన్నంగా జస్టిస్ నాగరత్న అది సదుద్దేశంతో కూడుకున్నదే కానీ చట్టవిరుద్ధని అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కేవలం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయడం కంటే దానిని అమలు చేయడానికి శాసన ప్రక్రియను అనుసరించాల్సి ఉందని చెప్పారు. 2019 తీర్పులో, జస్టిస్ నాగరత్న దేవాలయం వాణిజ్య సంస్థ కాదంటూ మరోసాహసోపేత తీర్పును వెలువరించారు. దాని ఉద్యోగులు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం గ్రాట్యుటీకి అర్హులు కాదని, అయితే కర్ణాటక హిందూ మతపరమైన సంస్థలు మరియు స్వచ్ఛంద సేవా చట్టం ప్రకారం ఇలాంటి ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది. కర్నాటక హైకోర్టులో 2021లో పోక్సో చట్టంపై ఇచ్చిన తీర్పు గురించి కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ చట్టంలోని సెక్షన్ 35లో పేర్కొన్న ఆదేశాన్ని పూర్తి కాని పక్షంలో నిందితులకు బెయిల్‌పై హక్కు ఉండదని జస్టిస్‌లు బీవీ నాగరత్న , ఎంజి ఉమతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. అంటే కేసును మొదట గుర్తించినప్పటి నుండి ఒక సంవత్సరంలోపు విచారణను ముగించాలి. పిల్లల ప్రమేయం ఉన్నట్లయితే, నేరాన్ని అంగీకరించిన 30 రోజులలోపు కోర్టు వారి సాక్ష్యాలను నమోదు చేయాలి. ఏవైనా జాప్యాలు జరిగితే వాటిని వ్రాతపూర్వకంగా రికార్డు చేయాలని కూడా స్పష్టం చేశారు. బిల్కిస్ బానో కేసు 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లలో సమయంలో బిల్కిస్ బానోపై ఇంట్లోకి చొరబడిన పలువురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలు నమోదైనాయి. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానో మూడేళ్ల కూతురితో పాటు ఇంట్లో అందరినీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఈ కేసులో మొత్తం పదకొండు మంది దోషులకు కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ తరువాత ఈ తీర్పుపై నిందితులు అప్పీల్ చేసుకోవడంతో యావజ్జీవ శిక్షగా మారింది. అయితే గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున సత్ ప్రవర్తన, 14 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్నారంటూ క్షమాభిక్షపేరుతో విడుదల చేసింది. దీంతో దిగ్భాంతికి గురైన బిల్కిస్ బానో తిరిగి సుప్రీను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో గతేడాది అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేశారు. ఈక్రమంలో జస్టిస్ నాగరత్న గుజరాత్ ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు. దోషుల క్షమాభిక్షను రద్దు చేశారు. -
బిల్కిస్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం
న్యూఢిల్లీ: బిల్కిస్ బాను అత్యాచార ఘటన దోషుల ముందస్తు విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు సీపీఎం నేత సుభాషిణీ అలీ, తృణమూల్ కాంగ్రెష్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా ఎం.త్రివేదీల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కాసేపటికే, ఈ విషయమై గతంలో బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌పై విచారణ నుంచి గత డిసెంబర్ 13న జస్టిస్ త్రివేదీ తప్పుకున్న విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో న్యాయమూర్తులిరువురూ కాసేపు చర్చించుకున్నారు. అనంతరం ఈ విచారణ నుంచి కూడా ఆమె తప్పుకుంటున్నట్టు జస్టిస్ రస్తోగీ చెప్పారు. ఆమె స్థానంలో మరో న్యాయమూర్తితో కలిసి ఫిబ్రవరి నుంచి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. తాజా పిటిషన్లను బిల్కిస్ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌కు కలిపి విచారిస్తామని వెల్లడించారు. -
Bilkis Bano Case: విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేయటాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారణ ఇవాళ (డిసెంబర్ 13న) చేపట్టాల్సి ఉండగా.. జస్టిస్ బేలా ఎం త్రివేది విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను కొత్త బెంచ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ముందుకు మంగళవారం బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదల పిటిషన్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది విచారించాలనుకోవట్లేదని తెలిపారు మరో జడ్జీ జస్టిస్ అజయ్ రాస్తోగి. ‘ఈ ధర్మాసనం ముందుకు పిటిషన్ వచ్చినా.. అందులో ఒకరు తప్పుకున్నారు.’అని జస్టిస్ రాస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే, జస్టిస్ త్రివేది ఎందుకు తప్పుకున్నారనే విషయంపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె కుటుంబ సభ్యులతో సహా పలువురిని హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు అనంతరం నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకుని.. జీవిత ఖైదుగా మార్చాయి. తాజాగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ పాలసీ ప్రకారం.. ఆ పదకొండు మందిని విడుదల చేసింది. ఆగస్టు 15న 11 మంది దోషులను విడుదల చేయటాన్ని రెండు వేరువేరు పిటిషన్ల ద్వారా సవాల్ చేశారు బిల్కిస్ బానో. సుప్రీం కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇదీ చదవండి: 11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో.. సుప్రీంలో పిటిషన్ -
‘బిల్కిస్ బానో’ దోషుల విడుదలపై సుప్రీం కోర్టులో పిల్
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేయటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు పలువురు మహిళా హక్కుల కార్యకర్తలు. సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో దోషులుగా తేలిన వారిని విడుదల చేయొద్దని పిటిషన్లో పేర్కొన్నారు. బిల్కిస్ బానో కేసు దోషుల రెమిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు మహిళా హక్కుల కార్యకర్తలు సుభాషిని అలీ, రేవతి లాల్, రాప్ రేఖ వర్మలు. ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, అపర్నా భట్. 14 మంది హత్య, గర్భిణీపై అత్యాచారానికి సంబంధించిన కేసులో దోషులను విడుదల చేయటాన్ని సవాల్ చేసినట్లు కపిల్ సిబాల్ పేర్కొన్నారు. ఈ పిల్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అంతకు ముందు.. సుమారు 6వేల మంది హక్కుల కార్యకర్తలు, చరిత్రకారులు దోషుల విడుదలను వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు. ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్ ఆవేదన -
Telangana: స్మితా సబర్వాల్ గీత దాటారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ గీత దాటారంటూ చర్చ నడుస్తోంది. గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మంది జీవిత ఖైదీలకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి, విడుదల చేయడం దేశవ్యాప్తంగా దూమారం రేపుతోంది. వీరి క్షమాభిక్షకు వ్యతిరేకంగా తెలంగాణ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి ట్విట్టర్ వేదికగా మూడు రోజులుగా ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు. ‘వాళ్లకు ఉరితాళ్లే సరి. పూలదండలతో సన్మానాలు కాదు. వారి క్షమాభిక్షను రద్దు చేసి మా నమ్మకాన్ని పునరుద్ధరించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో పాటు రాజ్యాంగ అధిపతులకు విజ్ఞప్తి చేస్తున్న’ అని ఆమె ఆదివారం మరో ట్వీట్ చేశారు. గోద్రా జైలు నుంచి విడుదలైన తర్వాత వారిని కొందరు పూలదండలతో సత్కరించి మిఠాయిలు తినిపించడం, ఆ తర్వాత కొన్ని సంస్థలు సన్మానాలు చేయడం పట్ల చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోవలో స్మితా సబర్వాల్ సైతం స్పందించారు. గీత దాటారంటూ.. ‘ఒక మహిళగా, సివిల్ సర్వెంట్‌గా ఈ వార్తలు చదువుతున్నప్పుడు నమ్మలేక పోయిన. భయం లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే బిల్కిస్ హక్కును హరించి, మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేము’ అని రెండు రోజుల కింద ఆమె చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఆమె ధైర్యాన్ని చాలామంది ప్రశంసించారు. ఐఏఎస్ అధికారై ఉండి ఓ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. దానికి ఆమె ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ అధికారుల వాక్ స్వేచ్ఛను హరించే సర్వీసు నిబంధనలను రద్దు చేయాల్సిన సమయం వచ్చింది’ అంటూ చేసిన మరో ట్వీట్ సైతం వైరల్‌గా మారింది. వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తప్పులేదని కొందరు ఐఏఎస్ అధికారులు ఆమెకు బాసటగా నిలిచారు. గీత దాటారని మరికొందరు సహచరులు తప్పుబడుతున్నారు. ఇక గుజరాత్ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిస్తున్న వాళ్లు ఆమెపై సోషల్ మీడియాలో ప్రతిదాడి చేస్తున్నారు. They deserved the noose not garlands. Appeal to the Supreme Court and Constitutional heads to cancel the remission, and restore our faith. #JusticeForBilkisBano pic.twitter.com/ECqXhZacF4 — Smita Sabharwal (@SmitaSabharwal) August 21, 2022 On the same note, is it not time to Ungag us, the #civilservice . We give the best years of our life, learning and unlearning our pride that is #India. We are informed stakeholders.. then Why this ?? #FreedomOfSpeech pic.twitter.com/ymHNJFVjAR — Smita Sabharwal (@SmitaSabharwal) August 19, 2022 ఇదీ చదవండి: అమిత్ షా.. ఓ ప్రముఖ క్రికెటర్ తండ్రి.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు -
‘వారు సంస్కారవంతులు’.. బిల్కిస్ బానో దోషులకు బీజేపీ ఎమ్మెల్యే మద్దతు
బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది నిందితులను విడుదల చేయటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈక్రమంలో అధికార బీజేపీ ఎమ్మెల్యే దోషులకు మద్దతు తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులోని దోషుల్లో కొందరు బ్రాహ్మణులు ఉన్నారని, వారు సంస్కారవంతులని గుజరాత్‌లోని గోద్రా బీజేపీ ఎమ్మెల్యే సి.కె.రౌల్జీ చెప్పారు. ఈ కేసులో దోషులకు శిక్షను తగ్గించాలని సిఫార్సు చేసిన ప్రభుత్వ కమిటీలోని ఇద్దరు బీజేపీ నేతల్లో ఎమ్మెల్యే రౌల్జీ ఒక సభ్యుడు కావడం గమనార్హం. ‘వారు నేరం చేశారో లేదో నాకు తెలియదు. కానీ, నేరం చేసే ఉద్దేశం ఉండి ఉండాలి. వారిలో కొంత మంది బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులు మంచి సంస్కారవంతులు. వారిని శిక్షించాలని కొందరి దురుద్దేశం అయి ఉండవచ్చు. జైలులో ఉన్నప్పుడు వారు సత్ప్రవర్తన కలిగి ఉన్నారు.’ అని పేర్కొన్నారు సీకే రౌల్జీ. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బిల్కిస్ బానో కేసు 2002 గుజరాత్ గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో.. దాహోద్ జిల్లా లింఖేధా మండలం రంధిక్పూర్లో.. మూక దాడులు జరిగాయి. దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చడంతో పాటు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. బిల్కిస్ బానోస్ కుటుంబంపైనా దాడి జరిగింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్ కుటుంబ సభ్యులు ఏడుగురిని(బిల్కిస్ మూడేళ్ల కూతురిని సహా) హతమార్చారు. ఆ సమయానికి బిల్కిస్ వయసు 21 ఏళ్లు. ఆ దాడుల్లో ప్రాణాలతో బయటపడింది బిల్కిస్, ఓ వ్యక్తి, మూడేళ్ల ఓ చిన్నారి మాత్రమే. ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్ ఆవేదన -
మోదీజీ.. సిగ్గనిపించడం లేదా?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అత్యాచార ఘటనల్లో దోషులకు అధికార బీజేపీ అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మహిళల పట్ల బీజేపీ వైఖరి ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇలాంటి రాజకీయాలు చూస్తే మీకు సిగ్గనిపించడం లేదా? అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సూటిగా ప్రశ్నించారు. ఉన్నావో, హథ్రాస్, కథువా తదితర సంఘటనల్లో నేరస్తులకు బీజేపీ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. గుజరాత్లో బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడినవారిని జైలు నుంచి విడుదల చేశారని ఆక్షేపించారు రాహుల్ గాంధీ. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. బిల్కిస్ బానోపై గ్యాంగ్‌రేప్ కేసులో దోషులైన 11 మందిని జైలు నుంచి విడుదల చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సైతం తప్పుపట్టారు. उन्नाव- भाजपा MLA को बचाने का काम कठुआ- बलात्कारियों के समर्थन में रैली हाथरस- बलात्कारियों के पक्ष में सरकार गुजरात- बलात्कारियों की रिहाई और सम्मान! अपराधियों का समर्थन महिलाओं के प्रति भाजपा की ओछी मानसिकता को दर्शाता है। ऐसी राजनीति पर शर्मिंदगी नहीं होती, प्रधानमंत्री जी? — Rahul Gandhi (@RahulGandhi) August 18, 2022 ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్ ఆవేదన -
ఇక భయంతో బతకాల్సిందేనా?: బిల్కిస్ బానో ఆవేదన
తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను రెమిషన్ కింద విడుదల చేయడంపై బిల్కిస్ యాకూబ్ రసూల్ అలియాస్ బిల్కిస్ బానో స్పందించారు. న్యాయవ్యవస్థ పట్ల తనకున్న నమ్మకాన్ని ఈ నిర్ణయం చెదరగొట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం తనను మోసం చేసిందని, ఆ నిర్ణయం బాధించిందని, ఇంతకాలం అభద్రతాభావంతో బతికిన తాను ఇకపైనా భయంభయంగా బతకాల్సిందేనా? అంటూ ప్రశ్నిస్తున్నారామె. ‘‘న్యాయస్థానాలు పవిత్రమైనవి నమ్మాను. కానీ, ఏ మహిళకైనా న్యాయపరిధిలో ఇలాంటి ముగింపు దక్కుతుందా?. నేను వ్యవస్థను నమ్మాను. అందుకే గాయంతోనే జీవించడం నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. నా ఈ బాధ, అస్థిరమైన విశ్వాసం నా ఒక్కదానిదే కాదు.. న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి స్త్రీది అని ఆమె పేర్కొన్నారు. ఇది అన్యాయం. నా భద్రత, బాగోగుల గురించి పట్టింపులేదన్నట్లు గుజరాత్ ప్రభుత్వం వ్యవహరించింది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలిని సంప్రదించాలన్న స్పృహ గుజరాత్ ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరం. గుజరాత్ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే.. భయాందోళనలు లేకుండా మనశ్శాంతిగా బతికే నా హక్కును నాకు ఇవ్వమని. నన్ను, నా కుటుంబానికి రక్షణ కల్పించమని అని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు. జైల్లో ఉన్నా భయంగానే.. బిల్కిస్ బానో పోరాటం పద్దెనిమిదేళ్ల పైనే కొనసాగింది. ఈ సమయంలో ఆమె ఒక చోట స్థిరంగా ఉండలేదు. దోషుల కుటుంబాల నుంచి హాని పొంచి ఉండడంతో అజ్ఞాతంలో కొన్నాళ్లు, ఆపై క్రమంతప్పకుండా ఇళ్లను మారుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు నిందితుల విడుదలతో ఆమెలో మరింత ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాది శోభా గుప్తా చెప్తున్నారు. నిందితుల విడుదల వ్యవహారంపై న్యాయ పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారామె. గుజరాత్ వీహెచ్‌పీ ఆఫీస్‌లో సన్మానం అందుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు దోషులు బిల్కిస్ బానో కేసు 2002 గుజరాత్ గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో.. దాహోద్ జిల్లా లింఖేధా మండలం రంధిక్పూర్లో.. మూక దాడులు జరిగాయి. దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చడంతో పాటు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. బిల్కిస్ బానోస్ కుటుంబంపైనా దాడి జరిగింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్ కుటుంబ సభ్యులు ఏడుగురిని(బిల్కిస్ మూడేళ్ల కూతురిని సహా) హతమార్చారు. ఆ సమయానికి బిల్కిస్ వయసు 21 ఏళ్లు. ఆ దాడుల్లో ప్రాణాలతో బయటపడింది బిల్కిస్, ఓ వ్యక్తి, మూడేళ్ల ఓ చిన్నారి మాత్రమే. ఈ కేసులో 2008, జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేలుస్తూ శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ బిల్కిస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేసును సుప్రీంకోర్టు అహ్మదాబాద్ నుంచి బాంబే హైకోర్టుకు బదలాయించింది. ఇది అత్యంత అరుదైన కేసని, ప్రధాన నిందితులైన జశ్వంత్‌భాయ్, గోవింద్‌భాయ్, రాధేశ్యాంలకు ఉరిశిక్ష వేయాలని సీబీఐ వాదించింది. అయితే.. కింది కోర్టు ఇచ్చిన జీవిత ఖైదు తీర్పును సమర్థించి బాంబే హైకోర్టు. 1992 పాలసీ ప్రకారం.. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో నిందితులను రెమిషన్ కింద విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. దీంతో దేశం మొత్తం భగ్గుమంది. రేపిస్టులు.. నరహంతకులను విడుదల చేయడంపై రాజకీయ నేతల దగ్గరి నుంచి సామాన్యుల దాకా సోషల్ మీడియాలో గుజరాత్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రెమిషన్ పాలసీ 2014 ప్రకారం.. తీవ్రమైన నేరాలకు పాల్పడిన నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయకూడదు. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం దోషులకు 2008లో శిక్ష పడిందని, ‘సుప్రీం కోర్టు ఆదేశాలానుసారం 1992 పాలసీ ప్రకారం’ వాళ్ల విడుదల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని విడుదల చేశామని తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇదీ చదవండి: అసలు ‘బిల్కిస్’ దోషుల విడుదలకు కేంద్రం అనుమతి ఉందా? -
‘‘బిల్కిస్’ దోషుల విడుదలకు కేంద్రం అనుమతి ఉందా?’
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో ఉదంతంలో ప్రధాని మోదీపై విమర్శల దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రం చేసింది. సామూహిక అత్యాచారం, హత్యలకు సంబంధించిన ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది విడుదల విషయంలో గుజరాత్ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘ఈ నిర్ణయానికి మోదీ అనుమతి ఉందా? లేని పక్షంలో గుజరాత్ సీఎంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆయన, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పాలి’’ అని బుధవారం డిమాండ్ చేశారు. మోదీ మాటలకూ చేతలకూ ఎంత తేడా ఉందో ప్రపంచమంతా గమనిస్తూనే ఉందన్నారు రాహుల్ గాంధీ. ‘‘ఐదు నెలల గర్భిణిపై సామూహిక అత్యాచారానికి, ఆమె మూడున్నరేళ్ల చిన్నారితో పాటు ఏడుగురు కుటుంబీకుల పాశవిక హత్యకు పాల్పడ్డ వాళ్లను స్వాతంత్య్ర అమృతోత్సవం నాడే విడుదల చేశారు. నారీ శక్తి అంటూ భారీ ప్రసంగాలు చేసిన వాళ్లు ఈ చర్యల ద్వారా మహిళలకు ఏం సందేశమిచ్చినట్టు?’’ అంటూ మోదీ పంద్రాగస్టు ప్రసంగాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. సీబీఐ వంటి సంస్థలు దర్యాప్తు చేసిన కేసుల్లో దోషులకు కేంద్రం అనుమతి లేకుండా క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. ఇదీ చదవండి: మోదీజీ.. అదే నిజమైతే మీ చిత్తశుద్ది నిరూపించుకోండి.. రేపిస్టులకు బెయిల్ రాకుండా చేయండి: మంత్రి కేటీఆర్ -
కశ్మీరీ పండిట్లకు రక్షణ ఏదీ?: ఒవైసీ
ఢిల్లీ: కశ్మీరీ పండిట్ల రక్షణ విషయంలో కేంద్రం అవలంభిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తాజాగా అక్కడ కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణ దాడి నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. కశ్మీరీ లోయలో కశ్మీరీ పండిట్లకు రక్షణ కరువైంది. కేంద్ర పాలన దారుణంగా విఫలమవుతోంది. ఆర్టికల్ 370 రద్దు పండిట్లకు లాభం చేకూరుస్తుందని ప్రచారం చేసింది కేంద్రం. కానీ, ఇప్పుడు వాళ్లు అక్కడ అభద్రతా భావానికి లోనవుతున్నారు అని కేంద్రాన్ని నిందించారు ఒవైసీ. అక్కడ(జమ్ము కశ్మీర్)లో బీజేపీ చేత నియమించబడ్డ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. నరేంద్ర మోదీ పాలనే అక్కడా సాగుతోంది. కానీ, చేతకానీ స్థితిలో ఉండిపోయారు వాళ్లు అంటూ విమర్శించారు. అలాగే.. గుజరాత్లో బిల్కిస్ బానో దురాగతం నిందితులకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడంపైనా ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ నారీశక్తి గురించి మాట్లాడారు. అలాంటిది గ్యాంగ్‌రేప్ దోషులకు రిలీజ్ చేయడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. ఇక యూపీలో గాడ్సే ఫొటోతో తిరంగా యాత్రను నిర్వహించడంపై.. అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఎంపీ ఒవైసీ. మాటల్లో గాంధీని ఉపయోగిస్తున్నారని.. కానీ, చేతల్లో గాడ్సే మీద ప్రేమను ఒలకబోస్తున్నారంటూ యోగి సర్కార్‌పై మండిపడ్డారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో క(వ్య)థ ఇది! -
దిల్జిత్.. కరణ్ పెంపుడు జంతువు: కంగన
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం కంగనకు, నటుడు, సింగర్ దిల్జిత్ దోసంజ్‌కి మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. అతడిని కరణ్ జోహర్ పెంపుడు జంతువు అంటూ కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగన.. రైతుల ఆందోళనలో పాల్గొన్న ఓ సిక్కు మహిళను ఉద్దేశించి.. షాహీన్ బాగ్ దాదీలలో ఒకరైన బిల్కిస్ బానుగా భావించి.. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తప్పుగా ట్వీట్ చేయడంతో నెజిటనులు కంగనపై విరుచకుపడ్డారు. వెనకా ముందు చూసుకోకుండా.. ట్విట్ చేస్తే ఇలానే అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు, సింగర్ దిల్జత్ దోసంజ్ క్వీన్ హీరోయిన్ని ఉద్దేశించి ‘కంగన.. బిల్కిస్ బానుగా ట్వీట్ చేసిన మహిళ ఈమె.. పేరు మహిందర్ కౌర్. కంగన టీమ్ ఈ నిజం వినండి. ఎవరూ ఇంత గుడ్డివాళ్లలా ఉండకూడదు. ఆమె(కంగన) ఏమైనా చెప్తూనే ఉంటారు’ అంటూ మహీందర్ కౌర్ మాట్లాడిన వీడియోను కూడా ట్వీట్ చేశారు దిల్జిత్. దీనిపై కంగనా మండిపడ్డారు. దిల్జిత్‌ని కరణ్ పెంపుడు జంతువు అంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దిల్జిత్ ట్వీట్‌పై స్పందిస్తూ కంగన.. ‘ఓ కరణ్ జోహర్ పెంపుడు జంతువు.. షాహీన్ బాగ్‌లో తన పౌరసత్వం కోసం నిరసన చేసిన దాదీ.. ఇప్పుడు రైతులు కనీస మద్దతు ధర కోసం చేస్తోన్న ఆందోళనలో కేవలం వంద రూపాయల కోసం వచ్చి కూర్చున్నది. మహీందర్ కౌర్ జీ ఎవరో నాకు తెలియదు. మీరంతా ఏం డ్రామాలు ఆడుతున్నారు.. వెంటనే ఆపేయండి’ అంటూ విరుచుకుపడ్డారు కంగనా. (చదవండి: కంగనా ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి... లేదంటే!) Ooo Karan johar ke paltu, jo dadi Saheen Baag mein apni citizenship keliye protest kar rahi thi wohi Bilkis Bano dadi ji Farmers ke MSP ke liye bhi protest karti hue dikhi. Mahinder Kaur ji ko toh main janti bhi nahin. Kya drama chalaya hai tum logon ne? Stop this right now. https://t.co/RkXRVKfXV1 — Kangana Ranaut (@KanganaTeam) December 3, 2020 ఇక ఎంఎస్ మహీందర్ కౌర్‌ని చూసి బిల్కిస్ బాను అనుకోని కంగనా ట్వీట్ చేసినందుకు లీగల్ నోటీసులు పంపిచానని న్యాయవాది హకమ్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. వంద రూపాయలకి నిరసనలకి వస్తుంది అనే వ్యాఖ్యలపై ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసును కొనసాగిస్తామని తెలిపారు. 'ఫ్యాక్ట్ చెక్' అనే ఆన్లైన్ పోర్టల్‌లో బానో మాట్లాడుతూ...నేను ఆరోజు నిరసనలో పాల్గొనలేదని, షహీన్ బాగ్‌లోని తన నివాసంలోనే ఉన్నానని.. ఫోటోలో కనిపించింది నేనుకాదని అన్నారు. -
కంగనా ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి... లేదంటే!
న్యూ ఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగన రనౌత్ మరోసారి తన మాటలతో సమస్యల్లో చిక్కుకుంది. షహీన్ బాగ్ దాదీలలో ఒకరైన బిల్కిస్ బానోపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇబ్బందుల్లో పడేశాయి. నిరసనలలో కనిపించడానికి బిల్కిస్ బానో రూ.100 తీసుకుంటారని కంగన చేసిన ట్విట్‌పై దూమరం రేగింది. (చదవండి: శాసన మండలికి ఊర్మిళ?) ' హా హా హా ఏ దాదీ అయితే అత్యంత శక్తివంతమైన భారతీయురాలిగా టైమ్ మ్యాగజైన్లో చూసామో ఆమె ఇప్పుడు వంద రూపాయలకి నిరసనలలో అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ ప్రజాసంబంధ సంస్థను భారతదేశానికి సంబంధించి కాకుండా, పాకిస్తాన్‌కి సంబంధించి ఎంచుకున్నారు. ఇటువంటి వాటి గురించి అంతర్జాతీయంగా మాట్లాడటానికి సొంత వాళ్లు కావాలి' అని కంగనా ట్వీట్ చేశారు. ఎంఎస్ మొహిందర్ కౌర్‌ని చూసి బిల్కిస్ బాను అనుకోని కంగనా ట్వీట్ చేసినందుకు లీగల్ నోటీసులు పంపిచానని న్యాయవాది హకమ్ సింగ్ పేర్కొన్నారు. వంద రూపాయలకి నిరసనలకి వస్తుంది అనే వ్యాఖ్యలపై ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసును కొనసాగిస్తామని తెలిపారు. 'ఫ్యాక్ట్ చెక్' అనే ఆన్లైన్ పోర్టల్‌లో బానో మాట్లాడుతూ...నేను ఆరోజు నిరసనలో పాల్గొనలేదని, షహీన్ బాగ్‌లోని తన నివాసంలోనే ఉన్నానని, ఫోటోలో కనిపించింది నేనుకాదని అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ దర్యాప్తు సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలతో వెలుగులోకి వచ్చిన రనౌత్ నిత్యం ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటుంది. మహారాష్ట్ర రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆమెను చిక్కుల్లో పడేశాయి. ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చినందుకు శివసేన పార్టీ నాయకులు ఆమెపై దుమ్మెత్తిపోశారు.(చదవండి: యూపీ సీఎంతో బాలీవుడ్ హీరో భేటీ) మంగళవారం నటి ఊర్మిళ శివసేనలో చేరిన సంగతి విధితమే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...' కంగనకు కావాల్సిన ప్రాముఖ్యత దక్కింది. నేను తనతో మాటల యుద్ధంలో పాల్గొనాలని అనుకోవడంలేదు. నేను ఆమె అభిమానిని కాదు. మనమందరం తన గురించి తను కోరుకున్నదానికంటే ఎక్కువగానే మాట్లాడుకున్నాం ఇక ఇప్పుడు మాట్లాడటానికి ఏమి లేదని అనుకుంటున్నాను. మనం ప్రజాస్వామ్యదేశంలో నివసిస్తున్నాం ప్రతి పౌరుడికి వాక్ స్వేచ్ఛ ఉంది కాబట్టి వారు ఏం చేయానుకుంటున్నారో చేయోచ్చు' అని అన్నారు. -
మోదీ, షాహిన్‌బాగ్ దాదీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావితం చూపించిన వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీసహా ఐదుగురు భారతీయులు స్థానం సంపాదించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ఆందోళనలను ముందుండి నడిపించిన 82 ఏళ్ల వయసున్న బామ్మ బిల్కిస్ టైమ్ జాబితాలో స్థానం పొందారు. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా అత్యంత ప్రభావితం చూపించిన 100 మందిలో చోటు దక్కించుకున్నారు. ఇక ఇండియన్ అమెరికన్, డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ టైమ్స్ జాబితాకెక్కారు. రాజకీయ నాయకుల కేటగిరీలో మోదీతో పాటుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉన్నారు. భారత్‌ని ముందుకు నడిపించే నాయకుడు మోదీని మించి మరొకరు లేరని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధిని జయించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో క్లినికల్ మైక్రోబయాలజీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. అణగారిన వర్గాల గొంతుక షాహిన్‌బాగ్ దాదీగా పేరు సంపాదించిన బిల్కిస్ గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా 100 రోజుల పాటు రేయింబవళ్లు పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. ‘ఒక చేత్తో జపమాల, మరో చేత్తో జాతీయ జెండా పట్టుకొని అణగారిన వర్గాల గళంగా బిల్కిస్ నిలిచారు. మహిళలు, మైనార్టీల అణచివేతకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని రగిలించారు. పొద్దున్నే 8కల్లా ఠంచనుగా నిరసనకు కూర్చొనే ఆమె అర్ధరాత్రయినా కదిలేవారు కాదు’అని టైమ్ మ్యాగజైన్ ప్రొఫైల్‌లో షాహిన్‌బాగ్ దాదీ గురించి జర్నలిస్టు రాణా అయూబ్ రాసుకొచ్చారు. ఆయుష్మాన్ భవ ఆర్టిస్టుల కేటగిరిలో స్థానం దక్కించుకున్న బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గురించి టైమ్ ప్రొఫైల్‌లో నటి దీపికా పదుకొనె రాశారు. కన్న కలలు నిజం కావడం చాలా కొద్ది మంది చూస్తారని, అందులో ఆయుష్మాన్ ఒకరని అన్నారు. ఆయనలో ప్రతిభ, కష్టపడే తత్వంతో పాటుగా సహనం, పట్టుదల, నిర్బయంగా ముందుకు దూసుకుపోయేతత్వాన్ని దీపిక ప్రశంసించారు. -
బానోకు 50 లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: గోద్రా అల్లర్ల బాధితురాలు బిల్కిస్ బానోకు రూ. 50 లక్షల నష్ట పరిహారంతోపాటు ఉద్యోగం, వసతిని సమకూర్చాలని అత్యున్నత న్యాయస్థానం సోమవారం గుజరాత్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గత ఏప్రిల్‌లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పున:సమీక్షించాలని గుజరాత్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొట్టి పారేసింది. ఇక విచారించడానికి ఏమిలేదని, గత ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు ఏదైతే పరిహారం ఇవ్వాలని ఆదేశించిందో... దానినే అమలు చేయాలని మరోసారి స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. 2002 అల్లర్ల బాధితురాలైన బానోకు రెండు వారాల్లోగా ఉద్యోగం, వసతి కల్పించాలని ఆదేశించింది. 2002లో చోటుచేసుకొన్న గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురైంది. గుజరాత్‌లోని దహోద్‌లో ఆమెపై 22సార్లు అత్యాచారం చేయడమే కాక, మూడు సంవత్సరాల వయస్సున్న ఆమె కుమార్తెను అతిపాశవికంగా కొట్టి చంపారు. ఈ మారణకాండలో ఆమె తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయి, ఒక ఎన్జీవోలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం బాధితురాలు బిల్కిస్ బానో వయసు 40 సంవత్సరాలు. ఆమె చదువు కూడా అంతంత మాత్రమే. 'బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన వారికి శిక్షపడినప్పటికి, మానవప్రకోపం కారణంగా ఆమె తీవ్రంగా నష్టపోయింది. బాధితురాలికి తగిన పరిహారం చెల్లించాలని నిర్ణయించడానికి విస్తృత చట్టాల కోసం వెతకవలసిన అవసరం లేదు. మనోవేదనను బట్టి నష్టపరిహారాన్ని నిర్ణయించవలసి ఉంటుంది’ అని సుప్రీంకోర్టు తన తుది తీర్పులో అభిప్రాయపడింది -
బిల్కిస్ ధీర
పదిహేడేళ్ల కాలం అనేది ఎవరి జీవితంలోనైనా సుదీర్ఘమైనది. కానీ తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దమని, అందుకు కారకులైనవారిని శిక్షించమని కోరిన ఒక మహిళకు మన న్యాయస్థానాల్లో ఊరట లభించడానికి అంత సుదీర్ఘ కాలం పట్టింది. దేశ చరిత్రలో అత్యంత అమానుషమైన అధ్యాయంగా చెప్పదగిన 2002నాటి గుజరాత్ మారణకాండకు సంబంధించిన ఒక కేసులో బాధితురాలైన బిల్కిస్ బానోకు రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యోగం ఇవ్వడంతోపాటు వసతి కూడా కల్పించాలని మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అడుగడుగునా అవరోధాలెదురైనా ఇంత సుదీర్ఘకాలంపాటు పట్టు వీడకుండా ఎలా పోరాడగలిగారని బిల్కిస్ బానోను ఒక పాత్రికేయుడు అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం గమనించదగ్గది. ‘మీ కుటుంబం మొత్తం మీ కళ్లముందే తుడిచిపెట్టుకుపోయిన ప్పుడూ... మీ జీవితం సర్వనాశనమైనప్పుడూ న్యాయం కోసం పోరాడకుండా ఎలా ఉండగలరు?’ అన్నది ఆమె జవాబు. నిజమే...బిల్కిస్ బానోకు ఎదురైన అనుభవాలు సాధారణమైనవి కాదు. అవి పగవారికి కూడా రావొద్దని ఎవరైనా అనుకుంటారు. 19 ఏళ్ల వయసులో అయిదునెలల గర్భిణిగా ఉన్నప్పుడు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె మూడున్నరేళ్ల కుమార్తెను బండకేసి బాది చంపారు. కుటుంబంలోని మరో నలుగురు మహిళలపై కూడా సామూహిక అత్యాచారాలకు పాల్పడి హత్య చేశారు. ఆడా మగా కలిపి మొత్తం 14మంది ప్రాణాలు తీశారు. బిల్కిస్ బానో చనిపోయినట్టు నటించడంతో ఆమెను పొదల్లోకి విసిరి వెళ్లిపోయారు. ఇద్దరు పసివాళ్లతో, ఒంటిపై బట్టలు కూడా సరిగాలేని స్థితిలో ఆమె ఆ కాళరాత్రి గడిపి ఒక ఆదివాసీ మహిళ ఇచ్చిన ఆసరాతో ప్రాణాలు కాపాడుకుంది. ఇలాంటి ఉదంతాల గురించి విన్నప్పుడు మనం నాగరిక సమాజంలోనే జీవిస్తున్నామా అన్న సందేహం కలుగుతుంది. ఇంతటి దుర్మార్గం జరిగింది సరే... కనీసం ఆ తర్వాతనైనా కారకులైన ఆ మానవమృగాలను దండించడానికి, ఆ మహిళకు న్యాయం చేయడానికి ఇన్నేళ్ల సమయం పట్టడంలో ఏమైనా అర్ధముందా? దుర్మార్గం జరిగిన మర్నాడు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది మొదలుకొని అడుగడుగునా ఆమెకు అవరోధాలే ఎదురయ్యాయి. ఫిర్యాదును తారుమారు చేయడం, పోస్టుమార్టం నివేదికలను మార్చేయడం, అడుగడుగునా బెదిరింపులకు దిగడం, కొన్నిసార్లు ఆమెను హతమార్చేందుకు ప్రయత్నించడం షరా మామూలుగా సాగాయి. ఒక దశలో ఖననం చేసిన శవాల తలలు మాయమయ్యాయి. బిల్కిస్బానోకు నిలకడ లేదని, ఆమె క్షణానికో మాట మాట్లాడుతున్నదని చిత్రించారు. చివరకు తగిన సాక్ష్యాధారాలు లేవని మేజిస్ట్రేట్ కోర్టులో కేసు కొట్టేశారు. వెంటాడుతున్న దుండగులను తప్పించుకుంటూ, జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు వరకూ అన్నిచోట్లకూ వెళ్లి తన గోడు వినిపిస్తూ, అందుకోసం ఆ కాళరాత్రినాటి చేదు జ్ఞాపకాలను చెదిరిపోకుండా చూసుకుంటూ ఆమె జరిపిన పోరాటం అసాధారణమైనది. ఎట్టకేలకు అహ్మదాబాద్ కోర్టులో విచారణ ప్రారంభమయ్యాక సాక్షులకు ఇక్కడ రక్షణ లేదని ఆమె విన్నవించుకోవడంతో సుప్రీంకోర్టు ఈ కేసును 2004 ఆగస్టులో ముంబైకి బదిలీ చేసింది. ఆ తర్వాత ఆ కేసు తేలడానికి మరో నాలుగేళ్లు పట్టింది. ఆరుగురు పోలీసు అధికారులు, ఇద్దరు ప్రభుత్వ వైద్యులు సహా 19మందిపై అభియోగాలు నమోదు కాగా అందులో 11మందికి యావజ్జీవ శిక్ష పడింది. రెండేళ్లక్రితం ఈ శిక్షలను బొంబాయి హైకోర్టు ధ్రువీకరించింది. అంతేకాదు...కిందికోర్టు నిర్దోషులుగా తేల్చిన మరో 8మందిని సైతం శిక్షించాల్సిందేనని బిల్కిస్ బానో చేసిన అప్పీల్‌ను అంగీకరించి వారికి కూడా శిక్ష ఖరారు చేసింది. వీరిలో ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ భగోరా, మరో నలుగురు అధికారులు, ఇద్దరు వైద్యులు దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీం కోర్టు తాజాగా తోసిపుచ్చింది. తనకు ప్రకటించిన రూ. 5 లక్షల పరిహారాన్నీ పదిరెట్లు పెంచాలన్న ఆమె వినతిని అంగీకరించింది. భగోరా ఆలిండియా సర్వీస్ అధికారి గనుక అతనిపై చర్య తీసుకోవడానికి అనుమతించమని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని, నాలుగు వారాల్లో చర్య తీసుకుని తమకు వర్తమానం అందించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు క్రమాన్ని పరిశీలిస్తే బాధితులకు న్యాయం లభించడానికి మన దేశంలో ఎన్ని అవాంతరాలు ఎదురవుతాయో అర్ధమవుతుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం చూపిస్తూ, కేసు విచారణ ముందుకు పోకుండా చేయడం ప్రభుత్వాలకు రివాజుగా మారింది. చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం నిస్సహాయ స్థితిలో పడుతున్నాయి. ఏళ్లకు ఏళ్లు కేసులు పెండింగ్‌లో పడుతూ న్యాయస్థానాల సమయం వృధా అవుతోంది. గుజరాత్ మారణకాండకు సంబంధించి మరెన్నో కేసులు ఇంకా విచారణ దశలో ఉన్నాయి. ఈ కేసులు మాత్రమే కాదు...ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలోనూ, ఆ చుట్టుపట్లా జరిగిన సిక్కుల ఊచకోత కేసుల గతీ ఇలాగే ఉంది. కేసుల్లో ఇలా అసాధారణ జాప్యం చోటు చేసుకుంటే, నిందితుల నుంచి అడుగడుగునా బెదిరిం పులు ఎదురవుతుంటే అందరూ బిల్కిస్ బానో తరహాలో పోరాడలేరు. ఆమె పేదింటి మహిళ అయినా, ఉండటానికి గూడంటూ లేక భర్తతో కలిసి దాదాపు సంచారజీవనం సాగిస్తున్నా పది హేడేళ్లపాటు దృఢంగా నిలబడింది. గుజరాత్‌లోని వడోదర, అహ్మదాబాద్‌లతోపాటు ఢిల్లీ, లక్నో, ముంబై వంటి సుదూర నగరాలకు సైతం ఆ కుటుంబం వలసపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడింది. బిల్కిస్ బానో కేసు వంటివి అంతర్జాతీయంగా దేశ పరువు ప్రతిష్టల్ని దిగజారుస్తాయి. బాధితులకు న్యాయం దక్కడం అక్కడ అసాధ్యమన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. సకాలంలో దక్కని న్యాయం అన్యాయంతో సమానమంటారు. కనీసం ఊచకోతల కేసుల విష యంలోనైనా ఇలాంటి అన్యాయాలకు తావీయరాదన్న స్పృహ మన పాలకులకు కలగాలి. -
ఆమెకు రూ. 50 లక్షలు చెల్లించండి : సుప్రీం
న్యూఢిల్లీ : సామూహిక అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2002లో చెలరేగిన అల్లర్లలో భాగంగా సర్వం కోల్పోయిన ఆమెకు పరిహారంగా రూ. 50 లక్షలు చెల్లించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా ఆమె జీవనోపాధి కోసం ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆశ్రయం కూడా కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా గోద్రా అల్లర్ల అనంతరం గుజరాత్లో 2002లో తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దాహోద్ సమీపంలోని రాధిక్‌పూర్ గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబంపై మూకదాడి జరిగింది. కుటుంబ యజమాని బిల్కిస్ యాకూబ్ రసూల్, అతడి భార్య బానో మినహా మిగిలిన 13 మందిని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కూతురు సలేహ తలను బండకు బాది హత్య చేసిన అనంతరం.. బానో కూడా చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బానో స్థానికుల సహాయంతో ప్రాణాలు దక్కించుకుంది. ఇక 2008లో బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మందిని బాంబే హైకోర్టు దోషులుగా తేల్చింది. అయితే తన విషయంలో కొంతమంది పోలీసు అధికారులు నిందితులకు అనుకూలంగా వ్యవహరించి.. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారంటూ బానో కోర్టును ఆశ్రయించింది. అదే విధంగా తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ కేసును విచారించిన ఐదుగురు అధికారుల్లో నలుగురు రిటైర్డు కావడంతో వారికి పెన్షన్ అందకుండా మాత్రమే చేయగలిగామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వీరితో పాటు ఈ కేసును విచారించిన మరో అధికారి ప్రస్తుతం డీసీపీగా విధులు నిర్వర్తిస్తుండగా అతడిని డిమోట్ చేసినట్లు పేర్కొంది. చదవండి : బిల్కిస్ బానో... గుజరాత్ గాయం.. కోర్టు తీర్పులు బిల్కిస్ బానో... 2002 గుజరాత్ మారణహోమం ఉదంతాలను అనుసరించినవారికి తప్పనిసరిగా గుర్తుండే పేరు. మే 4 న ముంబై హైకోర్టు ఆమెపై పాశవికదాడి చేసిన 11 మందికి ట్రయల్ కోర్టు వేసిన శిక్షను ఖరారు పరిచింది. అంతేకాదు, సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఏడు మంది పోలీసులను, డాక్టర్లను కూడా దోషులుగా తేల్చింది. బిల్కిస్‌బానుకు సంబంధించి మాత్రమే కాదు గుజరాత్ మారణకాండకు సంబంధించి కూడా ఇది ముఖ్యమైన తీర్పు. గర్భిణిపై అత్యాచారం చేసి పసిబిడ్డను చంపి... 2002లో గోధ్రా రైలు దుర్ఘటన తర్వాత గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. అహ్మదాబాదుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాధిక్‌పూర్ గ్రామంలో భర్తతో పాటు నివసిస్తున్న బిల్కిస్‌బానుకు అప్పుడు వయసు 18. గుజరాత్ అల్లర్లు ఆ ఊరికి కూడా పాకడంతో అప్పటికే చుట్టుపక్కల ఉన్న 60 ముస్లిం కుటుంబాల ఇళ్లను తగులబెట్టారు. బాధితులతో పాటు బిల్కిస్ కూడా తన కుటుంబంతో పొలాలలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంది. అప్పటికి ఆమె గర్భవతి. మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. రెండు మూడు రోజులు వారు ఊరికి దూరంగా ఉన్న గుట్టల్లో పొదల్లో ప్రాణాలు కాపాడుకుని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి పారిపోదామనుకున్నారు. మార్చి 3, 2002న ఒక మట్టి మార్గం గుండా వాళ్లు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా రెండు ట్రక్కుల్లో ముష్కరులు ‘చంపండి... నరకండి’ అని నినాదాలు ఇస్తూ వాళ్లను చుట్టుముట్టారు. బిల్కిస్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ‘వాళ్లంతా మా ఊరి వాళ్లే. చిన్నప్పటి నుంచి నేను చూసినవాళ్లే. వాళ్లే నా పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు’ అని మీడియాతో మాట్లాడుతూ ఆనాడు బిల్కిస్ ఉద్వేగభరితమైంది. ‘వాళ్లు మొత్తం 11 మంది. ఒకడు ఆమె చేతిలోని మూడేళ్ల కుమార్తెను నేలకు కొట్టి అప్పటికప్పుడు చంపేశాడు. మిగిలినవారంతా ఆమెను వివస్త్రను చేసి అత్యాచారానికి పూనుకున్నారు. ‘నేను గర్భవతిని వదిలేయండి అంటున్నా వాళ్లు వినలేదు’ అంది బిల్కిస్. ఆమెపై అత్యాచారం చేయడమే కాదు ఆమె కుటుంబానికి చెందిన మొత్తం 13 మందిని దారుణంగా చంపేశారు. అపస్మారకంలో పడి ఉన్న బిల్కిస్ ఆ తర్వాత మూడు రోజులకు కోలుకుని శరణార్థుల శిబిరంలో పోలీసులకు ఫిర్యాదు చేయగలిగింది. పట్టించుకోని పోలీసులు... అయితే స్థానిక పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. దోషులను అరెస్టు చేయండి అంటే వినలేదు. దిగువ కోర్టులో కేసు కూడా ‘తగిన సాక్ష్యాధారాలు లేనందున’ నిలువలేదు. అయితే బిల్కిస్ తన పోరాటాన్ని మానలేదు. మానవ హక్కుల సంఘం ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించి తన కేసును సిబిఐ విచారించేలా ఆదేశాలు పొందగలిగింది. స్థానిక పోలీసులు, సిఐడిలు తనను వేధిస్తున్నందున సిబిఐ విచారణ కోరుతున్నానని ఆమె చేసిన విన్నపాన్ని అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. సిబిఐ రంగంలో దిగిన వెంటనే బిల్కిస్ కేసులోని తీగలన్నీ కదిలాయి. బిల్కిస్ కోల్పోయిన 13 మంది కుటుంబ సభ్యులను పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లు వారిని గుర్తు పట్టకుండా తలలు వేరు చేశారని, గోరీలలోని శవాలు త్వరగా పాడయ్యేలా చేశారని, సామూహిక ఖననం చేసి కేసు ఆనవాలు పట్టకుండా ఉండేలా జాగ్రత్తలు పడ్డారని విచారణలో తేలింది. గుజరాత్లో పారదర్శకమైన న్యాయవిచారణకు అవకాశం లేనందున సుప్రీంకోర్టు విచారణను గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేసింది. అక్కడ బిల్కిస్ కేసును ప్రత్యేక కోర్టు విచారణ చేసి 2008లో 11 మంది నిందితులకు యావజ్జీవకారాగార శిక్ష తీర్పు వెలువరించగా నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. మే 4, 2017 బిల్కిస్ కేసును విచారించిన ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రత్యేకకోర్టు విధించిన శిక్షనే అది బలపరిచింది. 11 మంది నిందితులు (ఒకరు మరణించారు) యావజ్జీవకారాగార శిక్ష పొందారు. వీరిలో ముగ్గురిని ఉరి తీయాలని సిబిఐ వాదించగా కోర్టు వారి వాదనను తోసిపుచ్చింది. ‘ఉరిశిక్ష కోరి నేను ప్రాణానికి ప్రాణం బదులు తీర్చుకోవాలనుకోవడం లేదు. నాకు కావలసింది న్యాయం. అది దక్కింది’ అని బిల్కిస్ పేర్కొంది. ఇన్నాళ్లు ఈ కేసు కోసం బిల్కిస్, ఆమె భర్త యాకుబ్ రసూల్ రహస్యంగా జీవిస్తూ వచ్చారు. నిందితుల వల్ల ప్రాణహాని ఉండటమే దీనికి కారణం. ఆనాడు నిందితులకు శిక్ష ఖరారు కావడంతో పాటుగా.. నేడు బిల్కిస్‌కు పరిహారంగా 50 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఆలస్యంగానైనా ఆమెకు పోరాటానికి గుర్తింపు దక్కిందని బిల్కిస్ మద్దతు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
15 ఏళ్లకు న్యాయం
బిల్కిస్ బాను గుజరాత్ గాయం బిల్కిస్ బాను. 2002 గుజరాత్ మారణహోమం ఉదంతాలను అనుసరించినవారికి తప్పనిసరిగా గుర్తుండే పేరు. నిన్న– అంటే మే 8న ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె ఉద్వేగపూరితంగా పత్రికలవారితో మాట్లాడింది. ‘ఇన్నాళ్లకైనా నాకు న్యాయం దక్కింది. ఈ దేశంలో న్యాయం కోసం ఎదురు చూసే వారికి ఈ తీర్పు భరోసానిస్తోంది’ అని ఆమె అంది. నాలుగు రోజుల క్రితం (మే 4)న ముంబై హైకోర్టు ఆమెపై పాశవికదాడి చేసిన 11 మందికి ట్రయల్ కోర్టు వేసిన శిక్షను ఖరారు పరిచింది. అంతే కాదు, సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఏడు మంది పోలీసులను, డాక్టర్లను కూడా దోషులుగా తేల్చింది. బిల్కిస్‌బానుకు సంబంధించి మాత్రమే కాదు గుజరాత్ మారణకాండకు సంబంధించి కూడా ఇది ముఖ్యమైన తీర్పు. గర్భిణిపై అత్యాచారం చేసి పసిబిడ్డను చంపి... 2002లో గోధ్రా రైలు దుర్ఘటన తర్వాత గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. అహ్మదాబాదుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాధిక్‌పూర్ గ్రామంలో భర్తతో పాటు నివసిస్తున్న బిల్కిస్‌బానుకు అప్పుడు వయసు 18. గుజరాత్ అల్లర్లు ఆ ఊరికి కూడా పాకడంతో అప్పటికే చుట్టుపక్కల ఉన్న 60 ముస్లిం కుటుంబాల ఇళ్లను తగులబెట్టారు. బాధితులతో పాటు బిల్కిస్ కూడా తన కుటుంబంతో పొలాలలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంది. అప్పటికి ఆమె గర్భవతి. మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. రెండు మూడు రోజులు వారు ఊరికి దూరంగా ఉన్న గుట్టల్లో పొదల్లో ప్రాణాలు కాపాడుకుని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి పారిపోదామనుకున్నారు. మార్చి 3, 2002న ఒక మట్టి మార్గం గుండా వాళ్లు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా రెండు ట్రక్కుల్లో ముష్కరులు ‘చంపండి... నరకండి’ అని నినాదాలు ఇస్తూ వాళ్లను చుట్టుముట్టారు. బిల్కిస్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ‘వాళ్లంతా మా ఊరి వాళ్లే. చిన్నప్పటి నుంచి నేను చూసినవాళ్లే. వాళ్లే నా పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు’ అని బిల్కిస్ ఉద్వేగభరితమైంది. వాళ్లు మొత్తం 11 మంది. ఒకడు ఆమె చేతిలోని మూడేళ్ల కుమార్తెను నేలకు కొట్టి అప్పటికప్పుడు చంపేశాడు. మిగిలినవారంతా ఆమెను వివస్త్రను చేసి అత్యాచారానికి పూనుకున్నారు. ‘నేను గర్భవతిని వదిలేయండి అంటున్నా వాళ్లు వినలేదు’ అంది బిల్కిస్. ఆమెపై అత్యాచారం చేయడమే కాదు ఆమె కుటుంబానికి చెందిన మొత్తం 13 మందిని దారుణంగా చంపేశారు. అపస్మారకంలో పడి ఉన్న బిల్కిస్ ఆ తర్వాత మూడు రోజులకు కోలుకుని శరణార్థుల శిబిరంలో పోలీసులకు ఫిర్యాదు చేయగలిగింది. పట్టించుకోని పోలీసులు... అయితే స్థానిక పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. దోషులను అరెస్టు చేయండి అంటే వినలేదు. దిగువ కోర్టులో కేసు కూడా ‘తగిన సాక్ష్యాధారాలు లేనందున’ నిలువలేదు. అయితే బిల్కిస్ తన పోరాటాన్ని మానలేదు. మానవ హక్కుల సంఘం ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించి తన కేసును సిబిఐ విచారించేలా ఆదేశాలు పొందగలిగింది. స్థానిక పోలీసులు, సిఐడిలు తనను వేధిస్తున్నందున సిబిఐ విచారణ కోరుతున్నానని ఆమె చేసిన విన్నపాన్ని అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. సిబిఐ రంగంలో దిగిన వెంటనే బిల్కిస్ కేసులోని తీగలన్నీ కదిలాయి. బిల్కిస్ కోల్పోయిన 13 మంది కుటుంబ సభ్యులను పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లు వారిని గుర్తు పట్టకుండా తలలు వేరు చేశారని, గోరీలలోని శవాలు త్వరగా పాడయ్యేలా చేశారని, సామూహిక ఖననం చేసి కేసు ఆనవాలు పట్టకుండా ఉండేలా జాగ్రత్తలు పడ్డారని విచారణలో తేలింది. గుజరాత్లో పారదర్శకమైన న్యాయవిచారణకు అవకాశం లేనందున సుప్రీంకోర్టు విచారణను గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేసింది. అక్కడ బిల్కిస్ కేసును ప్రత్యేక కోర్టు విచారణ చేసి 2008లో 11 మంది నిందితులకు యావజ్జీవకారాగార శిక్ష తీర్పు వెలువరించగా నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. మే 4, 2017 బిల్కిస్ కేసును విచారించిన ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రత్యేకకోర్టు విధించిన శిక్షనే అది బలపరిచింది. 11 మంది నిందితులు (ఒకరు మరణించారు) యావజ్జీవకారాగార శిక్ష పొందారు. వీరిలో ముగ్గురిని ఉరి తీయాలని సిబిఐ వాదించగా కోర్టు వారి వాదనను తోసిపుచ్చింది. ‘ఉరిశిక్ష కోరి నేను ప్రాణానికి ప్రాణం బదులు తీర్చుకోవాలనుకోవడం లేదు. నాకు కావలసింది న్యాయం. అది దక్కింది’ అని బిల్కిస్ పేర్కొంది. ఇన్నాళ్లు ఈ కేసు కోసం బిల్కిస్, ఆమె భర్త యాకుబ్ రసూల్ రహస్యంగా జీవిస్తూ వచ్చారు. నిందితుల వల్ల ప్రాణహాని ఉండటమే దీనికి కారణం. ‘గుజరాత్ మారణకాండ వంటిది ఏ దేశంలో ఎక్కడా జరగకూడదు. ఈ దేశంలో అసలు జరగకూడదు. జరిగినప్పుడు ఆలస్యమైనా సరే న్యాయం జరుగుతుందనే నమ్మకం, నేరం చేస్తే శిక్ష ఏదో ఒకనాటికి పడి తీరుతుందనే భయం ఉండాలంటుంది. బిల్కిస్ కేసు తీర్పు ఈ రెండు విషయాలనూ నిర్ధారణ చేస్తోంది. కచ్చితంగా ఇది న్యాయం కోసం చేసిన ఒక స్త్రీ విజయపోరాటం.’ అని బిల్కిస్ మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.