
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా దేశంలో వ్యాక్సిన్ కొరత చాలా తీవ్రంగా ఉందన్నారు. కనుక ఈ సమయంలో విదేశాలకు వ్యాక్సిన్ల ఎగుమతి ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రధాని వ్యాక్సినేషన్‌ను ‘టీకా ఉత్సవ్’ పేరిట జరపడానికి ఇది వేడుక కాదని రాహుల్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అన్నిరాష్ట్రాలకు ఎలాంటి పక్షపాతం లేకుండా సహాయం చేయాలి. మనమందరం కలిసి ఈ మహమ్మారితో పోరాడి ఓడించాలని సూచించారు. ‘టీకా ఉత్సవ్’ నిర్వహించే ప్రధాని ముందుగా వాటి కొరత లేకుండా చూడాలని రాహుల్ కోరారు. కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతతో ఇబ్బంది పడతోంది, కనుక ఆయా రాష్ట్రాల డిమాండుకు సరిపడా టీకా సరఫరా చేయాలని ఆయన సూచించారు.
बढ़ते कोरोना संकट में वैक्सीन की कमी एक अतिगंभीर समस्या है, ‘उत्सव’ नहीं-
— Rahul Gandhi (@RahulGandhi) April 9, 2021
अपने देशवासियों को ख़तरे में डालकर वैक्सीन एक्सपोर्ट क्या सही है?
केंद्र सरकार सभी राज्यों को बिना पक्षपात के मदद करे।
हम सबको मिलकर इस महामारी को हराना होगा।
( చదవండి: కరోనా కట్టడికి ఐదంచెల వ్యూహం )