తుక్కుగూడ జన జాతర సభ.. రాహుల్ గాంధీ ప్రసంగం ముఖ్యాంశాలు
- కొన్ని రోజుల కిందటే ఇక్కడే తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశా
- కొన్ని నెలల క్రితం తెలంగాణకు చేసిన వాగ్ధానం గుర్తుంది
- మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం
- తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లు దేశంలోనూ మాట నిలబెట్టుకుంటాం
- దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తాం
- ఐదు న్యాయసూత్రాలు భారతీయుల ఆత్మ
- యువతకు శిక్షణా కార్యక్రమాలు పెట్టబోతున్నాం
- ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టాం
- మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలు నిరుపేదలయ్యారు
- తెలంగాణలో 30 వేల ఉద్యోగాలిచ్చాం
- మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం
- రూ.500కు గ్యాస్ ఇచ్చాం
- 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చాం
- దేశ ప్రజల మనసులోని మాటే మా మేనిఫెస్టో
నారీ న్యాయ్ కింద ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష వేస్తాం ..
- నారీ న్యాయ్‌తో దేశ ముఖ చిత్రం మారబోతోంది
- ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష నగదు జమ చేస్తాం
- పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తాం
- దేశంలో నిత్యం 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
- మేం అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం
- ధనవంతులకు మోదీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు
- రైతులకు మాత్రం మోదీ రూపాయి కూడా మాఫీ చేయలేదు
- స్వామినాథన్ ఫార్ములా ప్రకారం రైతులకు మద్దతు ధర ఇస్తాం
- దేశంలో 50 శాతం మంది వెనుకబడిన వర్గాలే
- బడుగుల జానాభా 50 శాతం ఉంటే 5 శాతం ఉన్నవారి దగ్గరే అధికారం ఉంది
- కార్మికులకు కనీస వేతనాలు కల్పిస్తాం
కేసీఆర్ ఫోన్‌లు ట్యాప్ చేయించారు...
- గతంలో ఉన్న సీఎం ప్రభుత్వాన్ని ఎలా నడిపించారో మీకు తెలుసు
- వేల మంది ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించాడు
- ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశాడు
- రాత్రి పూట ఫోన్ చేసి డబ్బులు వసూలు చేశారు
- ప్రభుత్వం మారగానే డేటా మొత్తం ధ్వంసం చేశారు
- తెలంగాణలో కాంగ్రెస్ పని మొదలు పెట్టింది.. నిజం మీ ముందుంది
కేసీఆర్ ఏం చేశారో మోదీరు అదే చేస్తున్నారు
- మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఏం చేశారో ఢిల్లీలో మోదీ అదే చేస్తున్నారు
- తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడించాం
- ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్
- ఈడీ ఎక్స్‌టార్షన్ డైరెక్టరేట్‌గా మారింది
- ఒక రోజు సీబీఐ ఒక కంపెనీకి ఝలక్ ఇస్తుంది
- అదే కంపెనీ మరుసటి రోజు ఎన్నికల బాండ్లు కొంటుంది
బీజేపీ దగ్గర డబ్బుంది.. మా దగ్గర ప్రేముంది..
- బీజేపీ దగ్గర డబ్బుంది.. మా దగ్గర మీ ప్రేముంది
- బీజేపీ అనే అతిపెద్ద వాషింగ్‌మెషిన్ నడుస్తోంది
- బీజేపీకి డబ్బు ఇచ్చిన కంపెనీలకే కాంట్రాక్టులు దక్కాయి
- బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది
- మేము రాజ్యాంగాన్ని రద్దు చేయం
- మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం
- మా మేనిఫెస్టో దేశ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది
- కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు
- రైతులు, వెనుకబడిన వారికి మరో 5 హామీలు ఇచ్చాం
ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది: సీఎం రేవంత్‌రెడ్డి
- జాతికి 5 గ్యారెంటీలను రాహుల్ అంకితం చేశారు
- జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేయడం సంతోషం
- బీఆర్‌ఎస్‌ను ఓడించినట్లే దేశంలో బీజేపీని ఓడించాలి
- గత ప్రభుత్వం కేసులు పెట్టినా కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదు
- బీఆర్‌ఎస్‌ను తుక్కుతక్కుగా ఓడించిన ఉత్సాహం తుక్కుగూడలో కనిపిస్తోంది
- ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది
- ఉద్యోగాలివ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా
- తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం
- పదేళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసింది
- పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలి
కేసీఆర్‌కు చర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తా .. రేవంత్
- మాజీ ముఖ్యమంత్రి భాష సరిగా లేదు
- పదేళ్ల పాలనలో తెలంగాణను పీడించారు
- కేసీఆర్ మాట్లాడుతున్న మాటలకు లుంగీ లాగి చర్లపల్లిలతో చిప్పకూడు తినిపిస్తా
- కేసీఆర్‌కు జైలులో డబుల్ బెడ్‌రూమ్ కట్టిస్తా
- కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలులో ఉండొచ్చు
- ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు
- నేను జానారెడ్డిని కాదు.. ఊరుకోవడానికి
- పదేళ్లలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎన్ని
- పదేళ్లలో వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారు
- లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత నాది
- మేం హామీలు నెరవేరిస్తే 14 లోక్‌సభ సీట్లు గెలిపించండి
- ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలంటే 14 మంది ఎంపీలను గెలిపించాలి
కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రాహుల్‌గాంధీ
- తుక్కుగూడ జనజాతర సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఆవిష్కరించిన రాహుల్
- తెలంగాణకు సంబంధించి మేనిఫెస్టోలో 23 అంశాలు
- న్యాయపత్రం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో
- 5 గ్యారెంటీల పత్రం పేరుతో మేనిఫెస్టో విడుదల
భట్టి విక్రమార్క కామెంట్స్..
- అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు ప్రకటించాం
- కేసీఆర్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి
- ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం
- ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నాం
- 200 యూనిట్ల విద్యుత్ జీరో బిల్లులిస్తున్నాం
జనజాతర సభకు చేరుకున్న రాహుల్‌గాంధీ
- తుక్కుగూడ జనజాతర సభకు చేరుకున్న రాహుల్‌గాంధీ
- రాహుల్‌గాంధీ వెంట పలువురు కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్
- మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్‌గాంధీ
కేసీఆర్ మాట, యాస అదుపులో ఉంచుకుని మాట్లాడాలి : మంత్రి పొన్నం
- పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఎలా మాట్లాడాలో తెలియడం లేదు
- మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం
- రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌గాంధీ
- కాసేపట్లో తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభ
- సభ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ
- ఘనస్వాగతం పలికిన సీఎం రేవంత్, భట్టి, దీపాదాస్ మున్షీ
- జాతీయ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్‌గాంధీ
- తెలంగాణకు ఇచ్చే హామీలు వివరించనున్న రాహుల్
మళ్లీ సమర శంఖం
కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కూడా ప్రకటించనున్నారు.
మరోవైపు ఈ సభలోగానీ, అంతకుముందుగానీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని అంటున్నారు. ఇందులో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ సభ ప్రారంభానికి ముందు నోవాటెల్ హోటల్‌లో రాహుల్ సమక్షంలో ఈ చేరికలు జరగొచ్చని.. తర్వాత వారు సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. చేరేది ఎవరన్నదానిపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు.
టీపీసీసీ జన జాతర సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్‌చార్జులు, అసెంబ్లీ సమన్వయకర్తల సమన్వయంతో.. సభకు 10లక్షల మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కా>ంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను ప్రజలకు వివరించనున్నారు.
తెలంగాణకు ప్రత్యేక హామీలు
తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’ను తెలుగులో విడుదల చేయనుంది. దీనితోపాటు రాహుల్ గాంధీ తెలంగాణకు ప్రత్యేక హామీలను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు భద్రాచలం సమీప గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐటీఐఆర్ వంటి ఉపాధి ప్రాజెక్టును కేటాయిస్తామనే హామీ కూడా ఉంటుందని తెలిసింది.
చేరికలపై గోప్యత
జన జాతర సభ సందర్భంగా బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికల అంశాన్ని టీపీసీసీ గోప్యంగా ఉంచుతోంది. పార్టీ ముఖ్య నేతతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడికి మాత్రమే దీనిపై స్పష్టత ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేరే అవకాశం ఉందని.. నోవాటెల్ హోటల్‌లో రాహుల్ గాం«దీని ఎంపీ కె.కేశవరావు కలుస్తారని మాత్రం పేర్కొంటున్నాయి.
మరోవైపు కాంగ్రెస్‌లో చేరేవారు వీరే అంటూ కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేశ్, కోవ లక్ష్మి, కాలె యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, టి.ప్రకాశ్‌గౌడ్, మాణిక్‌రావు, డి.సు«దీర్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్‌కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడమైతే ఖాయమే. అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
శంషాబాద్ నుంచి నోవాటెల్‌కు.. తర్వాత సభకు..
రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక.. తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment