సాక్షి, వాయనాడ్ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ‍్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్‌షోలో అపశృతి దొర్లింది. కేరళలోని వాయనాడ్ లోకసభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రాహుల్ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బారికేడ్ విరిగిపడటంతో అక్కడున్న జర్నలిస్టులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే గాయపడిన ముగ్గురు జర్నలిస్టులను ఆసుపత్రికి తరలించే క్రమంలో రాహుల్ గాంధీకి వారికి సహాయం అందించారు. వారిని అంబులెన్స్‌లో తరలించేందుకు చురుగ్గా కదిలి వారికి సాయం చేశారు. దీంతో మరోసారి కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు అక్కడున్న వారినందరినీ ఆకట్టుకున్నారు.
నామినేషన దాఖలు చేసిన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశం ఒకటేనన్న సందేశాన్నిచ్చేందుకే తాను కేరళ వచ్చానన్నారు. ముఖ‍్యంగా అటు దక్షిణ భారతదేశం, ఇటు ఉత్తర భారతదేశం నుంచి కూడా పోటీ చేయాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు. మరోవైపు తన సోదరుడు, నిజమైన స్నేహితుడు, రాహుల్ గాంధీ అత్యంత ధైర్యవంతుడైన వ్యక్తి అనీ, అతణ్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
కాగా తన సోదరి, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర ప్రముఖ రాష్ట్ర పార్టీ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ వాయనాడ్‌లో గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు వీరికి ఘన స్వాగతం పలికారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని అమేధీ లోక్‌సభ స్థానం నుంచి కూడా రాహుల్ గాంధీ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment