
సాక్షి, తిరుపతి: ఈ నెల 27న మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చే నెల 2, 3, తేదీల్లో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. మూడో తేదీ సాయంత్రం తిరుపతి పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, తిరుపతి పార్లమెంట్ పరిధిలో శ్రీకాళహస్తి, నాయుడుపేటలో బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు.
గతంలో సిద్దం సభలు విజయవంతంగా జరిగాయన్నారు. ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, నంద్యాలలో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. మార్చి 30 గుత్తిలో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఏప్రిల్ 1న కదిరిలో ఇఫ్టార్ విందు, ఏప్రిల్ 2న పీలేరులో బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాలో ‘మేము సిద్దం’ సభలు నిర్వహిస్తామన్నారు. సభలు విజయవంతం చేసేందుకు అన్ని నియోజక వర్గాలు నాయకులు, కార్యకర్తలు సిద్దం గా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment